TRS VS BJP:  తెలంగాణ రాజధాని హైదరాబాద్ శనివారం రెండు మెగా ఈవెంట్లకు వేదికైంది. బేగంపేట ఎయిర్ పోర్టులో రాజకీయంగా ఆసక్తికర ఘటనలు జరిగాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. ఇద్దరు అగ్రనేతలు బేగంపేట ఎయిర్ పోర్టులోనే ల్యాండ్ అయ్యారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చి యశ్వంత్ సిన్హాకు స్వయంగా స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే నెలలో జరిగిన ఐఎస్బీ  స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. మోడీ అధికారిక కార్యక్రమానికి వచ్చినా కనీసం స్వాగతం చెప్పలేదు కేసీఆర్. అంతకుముందు ముచ్చింతల్ శ్రీరామనగరానికి వచ్చిన ప్రధాని మోడీని కేసీఆర్ కలవలేదు. రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణలో కేసీఆర్ పాల్గొనలేదు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారక పర్యటనకు వచ్చినా స్వాగతం చెప్పని కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన యశ్వంత్ సిన్హా కోసం బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చి వెల్ కం చెప్పడం జాతీయ స్థాయిలో చర్చగా మారింది. యశ్వంత్ సిన్హాకు గెలుపు అవకాశాలు కూడా లేవు. అయినా కేసీఆర్ కావాలనే ప్రచారాన్ని హైప్ చేశారని అంటున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి కాబట్టే కేసీఆర్ కావాలనే యశ్వంత్ సిన్హా పర్యటనలో హడావుడి చేశారని భావిస్తున్నారు.


కొంత కాలంగా ప్రధాని మోడీ, బీజేపీపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు కేసీఆర్. ప్రధాని మోడీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. గత ఆరు నెలల్లో మూడోసార్లు మోడీ హైదరాబాద్ వచ్చినా కనీసం పట్టించుకోలేదు. శనివారం మధ్యాహ్నం ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వస్తున్నారు. అయితే ప్రధానిని రిసీవ్ చేసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తరపున నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించారు. కాని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కోసం సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టు వెళ్లారు. సిన్హాకు సాదరంగా స్వాగతం పలికారు. సిన్హాకు స్వాగతం చెప్పేందుకు టీఆర్ఎస్ మంత్రులంతా వెళ్లగా.. ప్రధాని మోడీకి మాత్రం మాత్రం ఒక్క తలసానిని అపాయింట్ చేశారు. సీఎం కేసీఆర్ తీరుపై కమలనాధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ సర్కార్ తీరుపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


Read also: TRS BIKE RALLY: భాగ్యలక్ష్మి ఆలయానికి యోగీ.. చార్మీనార్ దగ్గర హై టెన్షన్.. టీఆర్ఎస్ ర్యాలీకి బ్రేక్


Read also: SpiceJet flight : స్పైస్ జెట్ విమానంలో పొగలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. తప్పిన ప్రమాదం...   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook


 

ZEENEWS TRENDING STORIES