తెలంగాణ (Telangana ) రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆధారంగా మారనున్న ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) దసరా రోజు ప్రారంభించనున్నారు. ప్రజలు విజయదశమిని శుభదినంగా భావిస్తారు. కాబట్టి దసరా రోజు పోర్టర్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. అప్పటి వరకు ధరణి పోర్టల్ కు సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


  ALSO READ |  Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్


అధికారులకు శిక్షణ
దీర్ఘకాలికంగా ఉపయోగపడే ధరణి పోర్టల్ కు ( Dharani ) సంబంధించిన కావాల్సిన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ వంటివి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయమని సూచించారు కేసీఆర్. ఒక ధరణి పోర్టల్ కు సరిపోయే విధంగా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేట్స్ వంటి ప్రధాన అంశాలపై తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు ట్రైనింగ్ ఇప్పించాలని అని సూచించారు.


కొత్త నియామకాలు
ధరణి పోర్టల్ పూర్తిగా సిద్ధం అయ్యే లోపు డమ్మీ పోర్టల్, లేదా నమూనాలపై అధికారులతో ట్రయల్స్ చేయమన్నారు. అలాగే ధరణి పోర్టల్ ను నిర్వహించేందుకు అందులో అప్డేట్స్ చేసేందుకు కావాల్సిన సిబ్బందిని నియమించే విధంగా జాగ్రత్తలు తీసుకొమన్నారు. దసరలోపు అన్ని ఆస్తులను, వాటి డాటాను ధరణిలో అప్డేట్ చేయాలన్నారు.



 ALSO READ |ATM : హైదరాబాద్ లో 12 వేల మంది కడుపు నింపిన రైస్ ఏటీఎం


రిజిస్ట్రేషన్ రేట్ల నిర్ణయం
ధరణి పోర్టల్ ప్రారంభం అవ్వడానికి ఇంకా సమయం ఉండటంతో అంతలోపు తెలంగాణ రాష్ట్రంలో సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ధరలను నిర్ణయించనున్నారు. ఈ కొత్త రేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ధరణి పోర్టల్ ప్రారంభం అయ్యేంత వరకు కొత్త రిజిస్ట్రేషన్లు జరగవని ముఖ్యమంత్రి తెలిపారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR