SMITHA Sabharwal : సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదకగా స్పందిస్తూ యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐఏఎస్అధికారి స్మితా సబర్వాల్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేశారు.ముందస్తు విచారణకు అవకాశం లేదనే కారణంతో గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఓ నిందితుడి శిక్షను గత వారం మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 25 ఏళ్లకు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ జస్టిస్ రోహిత్ ఆర్య మరియు జస్టిస్ రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ ధర్మానం నిందితుడికి 2 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు మహిళలు, సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఈ విషయంలోనే ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్.  న్యాయవ్యవస్థలో నిరాశ కలిగించే ఈ తరహా తీర్పులు ఇంకా కొనసాగితే.. ఈ దేశంలోని మహిళలకు ఆయుధాలు ధరించే హక్కును అనుమతించే సమయం ఆసన్నం అవుతుందని అన్నారు. న్యాయం మరియు చట్టం రెండు వేర్వేరు విషయాలు కావు... ఇది సిగ్గుచేటు అంటూ ఆమె కామెంట్ చేశారు.



స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై చేసిన కామెంట్లపై జోరుగా చర్చ సాగుతోంది. ఆమె మద్దతుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. మహిళల విషయంలో మీరు చేస్తున్న పోరాటం అభినందనీయం అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. కొందరు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలనే టార్గెట్ చేసుకుంటున్నారని, తెలంగాణలో మహిళలపై జరుగుతున్న  దారుణాలపై సరైన రీతిలో స్పందించడం లేదని మరి కొందరు విమర్శించారు.



Also Read : Rambha Family Pics : హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చిన రంభ కూతురు.. ఫోటోలు వైరల్


Also Read : Samantha Yashoda movie : నా మొహం మీద కొట్టారు.. అర్థగంట అదే షాక్‌లో ఉన్నా.. సమంత కామెంట్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook