New Posts sanctioned to 9 new Medical Colleges in Telangana: 2023లో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కళాశాలకు 433 పోస్టుల చొప్పున మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్‌లోని మెడికల్‌ కాలేజీలు మరియు వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లకు 3,897 పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను కేటాయించింది. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా ఇతర పోస్టులు ఇందులో ఉన్నాయి. 



వైద్య కళాశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు చేయడం పట్ల ఆర్థిక, వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందని హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలోని అందరికీ సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విషయం తెలిసిన వారు ఆనందం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Also Read: విరాట్ కోహ్లీనే ఆ రెండు సిక్సర్లు బాదగలడు.. దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉండుంటే..: హరీస్‌ రవూఫ్‌  


Also Read: గ్లాస్ వెనకాల అందాలు ఆరబోసిన అదా శర్మ.. హాట్ పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.