Curfew in Amaravati: అమరావతిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. 4 రోజుల పాటు కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్
మహారాష్ట్రలోని మూడు నగరాల్లో హింసాత్మక ఘటనలకు రజా అకాడమీయే కారణమని బీజేపీ ఆరోపించింది. పరిస్థితి అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Violence In Amaravati: త్రిపురలో (Tripura) జరిగిన హింసకాండ తరువాత పుకార్ల కారణంగా రెండు వారాల తరువాత శుక్రవారం మహా రాష్ట్రాల్లోని (Maharastra) మూడు నగరాలైన అమరావతి (Amaravati), నాందేడ్ (Nanded) మరియు మాలెగావ్‌లలో (Malegaon) హింసతో కూడిన అల్లర్లు, విధ్వంసకాండలు జరిగాయి. పోలీసులకు- అల్లరి మూకలకు జరిగిన విషయం మనకు తెలిసిందే.. అయితే దీనికి నిరసనగా బీజేపీ (BJP) నిన్న (శనివారం) అమరావతిలో బంద్‌కు పిలుపునిచ్చింది.
కానీ శనివారం కొనసాగిన బంద్ లో ఒక దుకాణం తెరచి ఉండటంతో బీజేపీ కార్యకర్తలు దాన్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నించిన క్రమంలో... పోలీసులు అడ్డుకోగా.. లాఠీచార్జి కూడా జరిగింది. ఫలితంగా 4 రోజుల కర్ఫ్యూ ప్రకటించగా.. పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం, మాలెగావ్ మరియు నాందేడ్ రెండింటిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నాయని, అయినప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!
త్రిపురలో జరిగిన హింసకు నిరసనగా మహారాష్ట్రలోని అమరావతిలో వరుసగా రెండో రోజు ఉద్రిక్తత నెలకొంది. అమరావతిలో మళ్లీ విధ్వంసం చెలరేగడంతో పాటు, దుకాణాలకు దుండగులు నిప్పటించారు. అమరావతి గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు బీజేపీ బంద్ (Bandh) ప్రకటించింది. విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. త్రిపుర పేరుతో అమరావతిలో మారణకాండకు కారణమెవ్వరు అనేదే అందరిలో తలెత్తుతున్న ప్రశ్న.. ?
వరుసగా రెండో రోజు కూడా అమరావతిలో రాళ్లదాడి, దుకాణాలకు నిప్పుపెట్టడం వంటి విధ్వంసం జరుగుతూనే ఉంది. శుక్రవారం జరిగిన హింసకు నిరసనగా శనివారం అమరావతి బంద్‌కు హిందూ సంస్థలు (Hindu organizations) పిలుపునిచ్చాయి. అమరావతి నగరంలో జరుగుతున్న హింసాత్మక నిరసనల కారణంగా CrPC సెక్షన్ 144 అమలు (144 Section) చేయబడిందని మరియు 4 రోజులు పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అవసరమైతే మరింత బలగాలను మోహారిస్తామని మహారాష్ట్ర డీజీపీ (Maharashtra DGP) సంజయ్ పాండే (Sanjay Pandey) వెల్లడించారు.
Also Read: Special Coins: రూ.75 & 100 కాయిన్లను జారీ చేయనున్న రిజర్వ్ బ్యాంక్
మహారాష్ట్రలోని ఇస్లామిక్ సంస్థ రజా అకాడమీ (Raza Academy) అల్లర్లను ప్రేరేపించిందని బీజేపీ పార్టీ ఆరోపించింది మరియు దానిపై ఎఫ్‌ఐఆర్ (FIR) కూడా నమోదైందని నాసిక్ ఎస్పీ (Nashik SP) సచిన్ పాటిల్ (Sachin Patil) తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.
మహారాష్ట్రలో నివసిస్తున్న హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. మహారాష్ట్ర ప్రభుత్వం వారికి పూర్తి రక్షణ కల్పిస్తోందని భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఆరోపిస్తోంది. త్రిపురలో ఏమి జరగలేదని, కొంత మంది అవకాశవాదులు వీటిని అనుకూలంగా మార్చుకొని... కేవలం హిందువులపై మాత్రమే దాడులు చేస్తున్నారని అన్నారు. హిందువులపై ఇలా ఒత్తిడి పెంచుటకు కారణాలు ఏంటంటే..?? మహారాష్ట్రలో హిందువులు బతకాలంటే ఇలా భయంతోనే బ్రతకాలన్న ఆలోచనలు ప్రేరేపించటానికే ఈ విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook