8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..ఇప్పట్లో 8వ వేతన సంఘం లేనట్లే..!
8th Pay Commission: 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. ఉద్యోగుల జీతాల పెంపు కోసం 8వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పట్లో ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో కొత్త సంఘం ఏర్పాటు చేయడం లేదని తెలిపింది. ఉద్యోగుల జీతాల పెంపునకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్లు పేర్కొంది.
దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ తగిలినట్లు అయ్యింది. ప్రస్తుత 7వ పే కమిషన్ 2014లో ఏర్పాటైంది. ఈవిషయాన్ని లోక్‌సభలో కేంద్రమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. వేతన సవరణపై విపక్షాలు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి 8వ వేతన సంఘం తీసుకొచ్చే ప్రతిపాదన తమ వద్ద లేదని తేల్చి చెప్పారు.
ద్రవ్యోల్బణంతో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల జీతాల వాస్తవ విలువ తగ్గితే..దానికి డీఏ పెంపుతో భర్తీ చేస్తామని ఈసందర్భంగా ఆయన తెలిపారు. ద్రవ్యోల్భణ రేటు ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ రేటు సవరిస్తామని స్పష్టం చేశారు. 2014లో 7వ వేతన సంఘాన్ని అమలులోకి తీసుకొచ్చారు. 2016 జనవరి 1 నుంచి కొత్త వేతనాలను అమలు చేస్తున్నారు.
Also read:Rajagopal Reddy: బీజేపీలో రాజగోపాల్‌రెడ్డి ఇమడగల్గుతారా..బండి సంజయ్‌తో భేటీ..!
Also read:Rain Alert Live Updates: ముంచుకొస్తున్న వాయు'గండం'..తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook