కరోనా వైరస్ ( Corona virus)  సంక్రమణ నేపధ్యంలో పీపీఈ కిట్ (PPE Kits) లకు ప్రాధాన్యత ఏర్పడింది. వైరస్ నుంచి రక్షణలో ఇవి కచ్చితంగా కవచాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఇప్పటివరకూ మనం కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందించే ప్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులు వీటిని వాడటం చూశాం. మహారాష్ట్రలో దొంగలు (Burglars) కూడా వాడుతున్నారు వీటిని...అదేంటో చూడండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దొంగతనం చేస్తే పట్టుబడకూడదంటారు. కానీ ఈ దొొంగలు (Thieves) మాత్రం ఈ సూత్రాన్ని పాటించారో లేదో తెలియదు కానీ దొంగతనం చేసినా కరోనా వైరస్ (corona virus) అంటించుకోకూడదనే ఇప్పటి ప్రాధమిక సూత్రాన్ని మాత్రం బాగా వంటబట్టించుకున్నట్టున్నారు. అందుకే దొంగతనం చేయడానికి కరోనా పీపీఈ కిట్ (PPE Kits) లు ధరించి మరీ వెళ్లారు. నమ్మలేకపోతున్నారా ..నిజమే. Also read: Corona virus: వందమంది కొంపముంచిన ఆ ఒక్కడు


ఈ సంఘటన మహారాష్ట్ర ( Maharashtra) లో జరిగింది. కరోనా వైరస్ ( Corona virus) అత్యధికంగా ఉన్నది ఈ రాష్ట్రంలోనే. అందుకే ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు ఆ దొంగలు. సతారా జిల్లా (Satara District) లోని ఓ  జ్యువెల్లరీ షాపులో   పీపీఈ కిట్ లు ధరించిన కొందరు దొంగలు నగల్ని దొంగిలించి పరారయ్యారు. ఈ మొత్తం ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అవడంతో అసలు  విషయం బయటికొచ్చింది. షాపు నుంచి దాదాపు 780 గ్రాముల బంగారం చోరీ అయినట్టు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also read: WHO: కోవిడ్ 19 వ్యాక్సీన్ అప్పుడే రాదు


వాస్తవానికి ఈ చోరీ జరిగి రెండ్రోజులైనా సరే...సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. కరోనా సంక్రమణ  నుంచి కాపాడుకోడానికి పీపీఈ కిట్లు ధరించి మరీ దొంగతనానికి పాల్పడ్డారు గానీ దొంగతనం చేయడం మాత్రం మానలేదు సదరు దొంగలు. పీపీఈ కిట్లు కూడా పూర్తిగా ధరించడం గమనార్హం. చేతులకు గ్లవ్స్, ఒంటినిండా కప్పేసిన పీపీఈ కిట్, తలపై క్యాప్..ఇలా ఎక్కడా రాజీ పడలేదు. 


జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..