బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ను హతమారుస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ప్రకాష్ రాజ్, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, కమ్యూనిస్ట్ లీడర్ బృందా కారత్ సహా 13 మంది హత్య చేసేందుకు ప్లాన్ చేశామని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ లేఖలో హెచ్చరించారు. ధర్మద్రోహులు, దేశ ద్రోహులను జనవరి 29న హతమార్చుతామని బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి ఓ లేఖ వచ్చింది. స్వామి మీతో పాటు చివరి ప్రయాణానికి సిద్ధం చేసిన వ్యక్తుల పేర్లు అంటూ ఆ లేఖను పంపడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: నా భార్య ఓడిపోవడమే మంచిదైంది: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు


'సంఘ్ పరివార్' సంబంధిత గ్రూపులను వ్యతిరేకించినందుకు మరణశిక్ష విధించబోతున్నాం అనేది లేఖ సారాంశం. ఆ బెదిరింపు లేఖను బెళగావి జిల్లా ఎస్పీకి అందజేసిన నిజగుణానందస్వామి ఆశ్రమ వాసులు ఫిర్యాదు చేశారు. ఆశ్రమానికి భద్రత కల్పిస్తామని పోలీసులు చెబుతున్నా.. మఠాధిపతి తిరస్కరించడం గమనార్హం. తమకు బెదిరింపులు వస్తున్నాయని మాజీ సీఎం కుమారస్వామి, ప్రకాష్ రాజ్‌లు సైతం సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే.


బజరంగ్ దళ్ మాజీ నేత మహేంద్ర కుమార్, నిజాగుననాడ అసురి స్వామి, నిడుమామిడి వీరభద్ర చెన్నమల్ల స్వామి (అసురి), జ్ఞానప్రకాష్ అసురి స్వామి, చేతన్ కుమార్ (నటుడు),  ప్రకాష్ రాజ్ (నటుడు), మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి, బృందా కారత్, బి.టి. లలితా నాయక్, ప్రొఫెసర్ మహేష్‌చంద్ర గురు, ప్రొఫెసర్ భగవాన్, దినేష్ అమిన్ మట్టు, చంద్రశేఖర్ పాటిల్, దుండి గణేష్, రౌడీ అగ్ని శ్రీధర్ పేర్లు బెదిరింపుల లేఖలో ఉన్నాయి.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..