బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దాడి కేసులో విచారణ ముమ్మరమైంది. మూడు కేసులు నమోదు చేసి...ఏడుగురిని అరెస్టు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్‌ ( West Bengal )లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Bjp chief jp nadda ) పర్యటన సందర్బంగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. దాడిలో ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానిక బీజేపీ నేతకు గాయాలయ్యాయి. ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Central minister amit shah ) సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు చేయిస్తామని ప్రకటించింది. 


ఈ కేసులో మూడు కేసులు నమోదు చేయడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేసినట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ( West Bengal Government ) తెలిపింది. జేపీ నడ్డా ప్రయాణింంచిన డైమండ్ హార్బర్ ప్రాంతంలో డీఐజీ స్థాయి అధికారి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం జరిగిన కాన్వాయ్ ప్రయాణ మార్గంలో నలుగురు అడిషనల్ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 14 మంది ఇన్ స్పెక్టర్లు, 70 మంది ఎస్ఐ, ఏఎస్ఐలు, 40 మంది ఆర్ఐఎఫ్ సిబ్బంది, 259 మంది కానిస్టేబుళ్లు, 350 మంది  సహాయక దళాల్ని నియమించినట్టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వివరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ కోరడంతో..పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ వివరాలు అందించింది. Also read: Farmer protests: వ్యవసాయ చట్టాలపై సుప్రీంను ఆశ్రయించిన రైతులు