Farmer protests: వ్యవసాయ చట్టాలపై సుప్రీంను ఆశ్రయించిన రైతులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 16 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ చట్టాలపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి.

Last Updated : Dec 11, 2020, 04:40 PM IST
Farmer protests: వ్యవసాయ చట్టాలపై సుప్రీంను ఆశ్రయించిన రైతులు

BKU approaches Supreme Court against Farm Laws: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 16 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ చట్టాలపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. మూడు చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం సవరణలకు మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలో కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను స‌వాలు చేస్తూ భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (Bhartiya Kisan Union)  శుక్ర‌వారం సుప్రీం కోర్టు ( Supreme Court ) గ‌డ‌ప తొక్కింది. 

ఈ కొత్త చ‌ట్టాల వ‌ల్ల రైతులు కార్పొరేట్ల‌కు బ‌ల‌వుతార‌ని, వీటిపై నిర్ణయం తీసుకోవాలంటూ రైతులు సుప్రీం కోర్టులో రైతు సంఘాల నాయకులు పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంటులో ఆమోదించిన చట్టాలను రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. అయితే ఈ చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ డిసెంబ‌ర్ 14న దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు రైతు సంఘాలు ( Farmers Organizations) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. Also read: Gudiko Gomata: ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం

ఇదిలాఉంటే.. రైతులు ఉద్యమ పంథాను వీడి ప్రభుత్వం (central government)తో చర్చలు జరపాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) విజ్ఞప్తి చేశారు. రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దానికోసం కొన్ని ప్రతిపాదనలను పంపించామని ఆయన తెలిపారు. రైతుల విషయంలో కేంద్రం ఆలోచిస్తూనే ఉందని, కనీస మద్దతు ధరను మరింత పటిష్ఠం చేసేందుకు కూడా వివరణ అడిగామని తెలిపారు. రైతుల ఉద్యమంతో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనిని దృష్టిలో ఉద్యమాన్ని విరమించుకోవాలని ఆయన రైతులను కోరారు. Also read: UPA చైర్మన్‌గా శరద్ పవార్‌ను నియమిస్తే మద్దతిస్తాం: శివసేన

 

Also read: Tamannaah: లిప్‌లాక్.. ఆ హీరోతో అయితే ఓకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News