జబ్ తక్ సమోసామే ఆలూ రహేగా..తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా… ఇప్పటివారికి ఈ మాటలు గుర్తున్నాయో లేదో గానీ లాలూ తరచూ చెప్పిన మాటలివి. అటువంటిది బీహార్ ( Bihar ) రాజకీయాల్లో తొలిసారి లాలూతో పాటు మరో ఇద్దరు కీలకనేతల్లేకుండానే రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సమోసాలో ఆలూ ( బంగాళదుంప ) ఉన్నంతవరకూ బీహార్ లో లాలూ ఉంటాడని రాజకీయాలను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ( Lalu prasad yadav ) సదా చెబుతుండే మాట ఇది. ఇప్పటివారికి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడలా జరగడం లేదు. నవంబర్ లో బీహార్ రాష్ట్ర ఎన్నికలు ( Bihar Elections ) జరగబోతున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు మరో ఇద్దరు కీలక నేతలైన శరద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ లు లేకుండానే ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో సూపర్ స్టార్ ప్రచారకుల్లా ఉన్న ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు బీహార్ ఎన్నికల్ని మిస్సవుతున్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ ముగ్గురు నేతలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.  


తమ తమ పార్టీల ప్రచారంలోనూ, టిక్కెట్ల పంపిణీలోనూ ఈ ముగ్గురు గత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికలే కాదు ఎన్నికలెప్పుడున్నా వీరిదే హవా నడిచేది. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీ ఎయిమ్స్ లో ఐసీయూలో ఉండగా..రాజధాని నగరంలోని మరో ఆస్పత్రిలో శరద్ యాదవ్ ( Sharad yadav ) చికిత్స పొందుతున్నారు. ఇక దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్...రాంచీలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 


ప్రస్తుతం లోక్ జనశక్తి పార్టీ ఛీఫ్ గా ఉన్న రామ్ విలాస్ పాశ్వాన్( Ram vilas paswan ) కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తండ్రి గురించి ట్వీట్ చేశారు. 1969లో తొలిసారి బీహార్ అసెంబ్లీకు ప్రాతినిధ్యం వహించిన తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్...50 ఏళ్ల బీహార్ చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. Also read: Sherlyn Chopra: క్రికెటర్ల భార్యలు డ్రగ్స్ మత్తులో...వివాదాస్పదమవుతున్న వ్యాఖ్యలు


అదే విధంగా 1977లో తొలిసారి లోక్ సభకు చాప్రా నుంచి ఎన్నికైన లాలూ సైతం దాదాపు 5 దశాబ్దాల తరువాత ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. అతని కుమారుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు.  


ఇక లోక్ తాంత్రిక్ జనతాదళ్ ను స్థాపించిన మరో ముఖ్యనేత శరద్ యాదవ్ 1974లో తొలిసారి జబల్పూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అనంతరం బీహార్ అసెంబ్లీకు మారిన ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సుభాషిణి రాజ్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. 


అయితే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నా సరే..లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఇంకా జైలు నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, ఏజేఎస్ యూ నేత రాధాకృష్ణ కిశోర్, కాంగ్రెస్ నేతలు జైల్లోనే లాలూను కలుస్తూ..ఎన్నికల పొత్తులు, సీట్ల పంపిణీపై చర్చలు జరపుతున్నారు. ఆర్జేడీ నేతలు నిత్యం తమ అధినేతను జైళ్లో కలుస్తూ..ఆశీస్సులు తీసుకుంటూనే ఉన్నారు. ఆలూ ఉన్నంతవరకూ లాలూ ఉండటమంటే ఇదేనేమో మరి. Also read: Bihar Elections: ఎన్డీయే కూటమి నుంచి ఎల్జేపీ వైదొలగనుందా ?