West Bengal, Tamil Nadu, Kerala, Puducherry, Assam Assembly Election Results 2021 LIVE Updates: ఇటీవల పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రానుండగా, అస్సాంలో బీజేపి నేతృత్వంలోని సర్బానంద సోనోవాల్ (CM Sarbananda Sonowal) తిరిగి అధికారం చేపట్టనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళలోనూ ఎల్డీఎఫ్ నేతృత్వంలోని సీఎం పినరయి విజయన్‌నే (Pinarayi Vijayan) మరోసారి విజయం వరించింది. తమిళనాడులో ఓటర్లు ఈసారి ఏఐడీఎంకే సారధ్యంలోని ముఖ్యమంత్రి పళనిస్వామిని కాకుండా ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని డీఎంకే పార్టీకి విజయం కట్టబెట్టారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యధిక ఎగ్జిట్ పోల్స్‌కి సమీపంగానే వెలువడగా.. వెస్ట్ బెంగాల్లోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని బీజేపీకి మధ్య పోటీ అన్నట్టుగా ఉంటాయని ఊహించినప్పటికీ అలా జరగలేదు. 


అస్సాంలో సీఎం సర్బానంద సోనోవాల్ మజులి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. అయితే, పశ్చిమ బెంగాల్లోనే సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చివర్లో పరాజయం పాలవడం ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్ (Nandigram election result, recounting) చేపట్టాల్సిందిగా ఆమె ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. 


Also read : Assembly Election Results 2021 Live Updates: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు


పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజల అవసరాలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని, అలాగే COVID-19పై విజయం సాధించేందుకు కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.


Also read : Tamil Nadu Assembly Election 2021 Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన అభ్యర్థులు.. వారి గెలుపు, ఓటములు


మరోవైపు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Puducherry Assembly Election Results 2021 live updates) ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపి-ఏఐడిఎంకే కలయికలోని ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాలు గెల్చుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్ఆర్ రంగస్వామి ఈ కూటమికి నేతృత్వం వహిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook