Tamil Nadu Assembly Election 2021 Results: చెన్నై: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి అధికార పార్టీ ఏఐడీఎంకేకు నిరాశే ఎదురు కాగా.. ఇప్పటివరకు ప్రతిపక్షం స్థానంలో ఉన్న ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఊహించినట్టే మెజారిటీ స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు ముఖ్య నేతలు, ప్రముఖులు, వారి గెలుపు, ఓటములు ఎలా ఉన్నాయో ఓ స్మాల్ లుక్కేద్దాం.
కొలాతూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ఏఐఏడిఎంకే (AIADMK) పార్టీ కీలక నేతల్లో ఒకరైన ఆది రాజారాంపై విజయం సాధించారు.
ఇడప్పడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏఐఏడీఎంకే నేత, సీఎం కే పళనిస్వామి (Edappadi K Palaniswami) తన సమీప ప్రత్యర్థి అయిన డీఎంకే నేత టి సంబాత్ కుమార్‌పై గెలిపొందారు.
కొవిల్‌పట్టి నియోజకవర్గం నుంచి ఏఎంఎంకే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టిటివి ధినకరణ్ (TTV Dhinakaran) ఏఐఏడిఎంకే పార్టీ నేత కాదంబూర్ రాజు చేతిలో ఓటమిపాలయ్యారు.
ఉదయ నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin). తమిళనాట సినీ స్టాల్‌వార్ట్‌గా, రాజకీయ దిగ్గజంగా పేరొందిన కరుణానిధికి మనవడిగా, ప్రస్తుత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కి (MK Stalin) వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ నిధి స్టాలిన్‌కి రాజకీయ నాయకుడిగా కంటే సినీ హీరోగానే ఎక్కువ గుర్తింపు ఉంది.
సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి యువకుడిగా సినిమాల్లోకి వచ్చిన ఉదయనిధి స్టాలిన్.. ఆ తర్వాత తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu assembly elections 2021 Results) చెపాక్-తిరువెల్లికెని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook