బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. బంగారం ధర భారీగా తగ్గగా, వెండి ధరలు పుంజుకున్నాయి. స్థానిక జ్యువెలర్ల కొనుగోళ్లు, అంతర్జాతీయ నిల్వలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, ఇతరత్రా అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. గుడ్ న్యూస్.. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.590 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,400కి క్షీణించింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.560 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.45,3600కి పతనమైంది. Photos: 36-24-36తో సెగలు రేపుతోన్న అందం


ఢిల్లీ మార్కెట్‌లోనూ నేడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గత వారం రోజులుగా ర్యాలీ అవుతున్న బంగారం ధర నేడు రూ.960 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,000కి క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.360 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.46,200కు పడిపోయింది.


బులియన్ మార్కెట్‌లో నిన్న రూ.840 మేర భారీగా తగ్గిన వెండి ధర నేడు రూ.1340 మేర భారీగా పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర ధర రూ.49,000కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండికి ఇదే ధర ఉంటుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్