బులియన్ మార్కెట్‌లో నేడు ధరలు మిశ్రమంగా ఉన్నాయి. గత రెండు రోజుల్లోనే దాదాపు రూ.1800 మేర తగ్గిన బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే.   శుభవార్త.. మీ PF రెట్టింపు అవుతుంది!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.90 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,120కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40,430అయింది. Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


నేడు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో బంగారం ధర రూ.90 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.44,470కి దిగొచ్చింది. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర  రూ.41,900 వద్ద ట్రేడ్ అవుతోంది. PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!


కాగా, గత వారం చివర్లో భారీగా దిగొచ్చిన వెండి ధర నేటి మర్కెట్లో రెట్టింపు ధర పెరిగింది. 1కేజీ వెండి రూ.1,540 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.42,700కి చేరుకుంది. పది రోజుల గరిష్ట ధరలో వెండి మార్కెట్ అవుతోంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos