28 వేలు దాటి కరోనా కేసులు.. 900 చేరువలో మృతుల సంఖ్య
భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 28,380కి చేరగా ఇప్పటివరకు 886 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,913గా ఉంది. భారత్ లో కరోనా సోకి నయమైన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 28,380కి చేరగా ఇప్పటివరకు 886 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,913గా ఉంది. భారత్ లో కరోనా సోకి నయమైన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం భారత్ లో రికవరి రేటు 22 శాతంగా ఉంది. కరోనా వైరస్ వ్యాపించిన అనేక ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో రికవరీ రేటు అత్యంత మెరుగైనదిగా కేంద్రం అభిప్రాయపడింది.
Also read : సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. విమర్శలు, డిమాండ్స్
భారత్ లో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో 8.068 కేసులతో మహారాష్ట్ర ముందంజలో ఉండగా 3,301 కరోనా పాజిటివ్ కేసులతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత 2,918 పాజిటివ్ కేసులతో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాని జిల్లాలు 280 ఉండగా.. గత వారం రోజులుగా కొత్తగా ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాని జిల్లాలు 64 ఉన్నాయి. గత 14 రోజుల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు 48 ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..