Chennai Heavy Rain: తమిళనాడులోని చెన్నైలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. గత రాత్రి నుంచి చెన్నైలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు కావడం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. పెరంబూర్ బ్యారక్స్ రోడ్డు, ఒట్టేరి వంతెన, పాడి తదితర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు. భారీ వర్షం కారణంగా ఎంతమేర నష్టం కలిగిందనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015లో వచ్చిన వరదల తర్వాత.. చెన్నైలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై నగరంలోని చెంబరంపాక్కం చెరువు గేట్లను తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెంబరపాక్కం కాలువ వెంబడి ఉండే గ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.


వర్షాల కారణంగా చెన్నై నగరంలోని రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెన్నైతో పాటు తిరువల్లూర్​లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.


అయితే నవంబరు 11 వరకు చెన్నై నగరంలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.


భారీ వర్షాల నేపథ్యంలో నవంబరు 10-12 వరకు బంగాళాఖాతం మీద చేపల వేటకు వెళ్లొద్దని మత్య్సకారులకు అధికారులు సూచించారు. 


Also Read: Chennai Floods: చెన్నైని ముంచెత్తనున్న వర్షాలు, వెంటాడుతున్న 2015 వరద భయం 


Also Read: Corona Cases In India: దేశంలో కొత్తగా 10,853 కొవిడ్ కేసులు.. 526 మరణాలు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook