TRP scam: Centre Govt forms committee: న్యూఢిల్లీ: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ కుంభకోణం (TRP scam) నేపథ్యంలో టెలివిజన్ ఛానెళ్ల రేటింగ్‌ ఎజెన్సీలపై సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రసార భారతి సీఈఓ శశి ఎస్. వేంపటి (Prasar Bharati CEO Shashi S Vempati) నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని కేంద్రం బుధవారం ఏర్పాటు చేసింది. దీని నివేదికను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు రెండు నెలల్లో సమర్పించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. అయితే 2014లో తీసుకొచ్చిన మార్గదర్శకాలే ప్రస్తుతం ఉన్నాయని.. వాటిని సమీక్షించాలని ప్రభుత్వం పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల సిఫారసుల మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేసి బలమైన, పారదర్శకత, జవాబుదారీ రేటింగ్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం కమిటీకి సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రసార భారతి సీఈఓ శశి ఎస్.వేంపటితో పాటు ఈ కమిటీలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ శలాబ్ (Dr Shalabh), సీ-డాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ (Dr Rajkumar Upadhyay), ప్రొఫెసర్ పులక్ ఘోష్ ( Pulak Ghosh) సభ్యులుగా ఉండనున్నారు. Also read : Arnab Goswami Arrest: ప్రతీకారం కాదు, చట్ట ప్రకారమే చేశామన్న సంజయ్‌ రౌత్‌


నకిలీ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ కుంభకోణం తరువాత.. అక్టోబరు 15న బార్క్ (Broadcast Audience Research Council ) వార్తా ఛానెళ్ల వారంతపు రేటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ముంబై పోలీసులు (Mumbai Police) గతనెలలో టీఆర్‌పీ కుంభకోణానికి సంబంధించి పలు న్యూచ్ ఛానెళ్ల ఉద్యోగులను అరెస్టు చేశారు. అంతేకాకుండా రిపబ్లిక్ టీవీ సిబ్బందిని సైతం ప్రశ్నించారు. Also read: TRS: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్.. స్థలం అప్పగింత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe