హలగేరి: కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఎస్కార్ట్ వాహనాన్ని మంగళవారం రాత్రి కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో మంత్రి హవేరి జిల్లాలోని హతగెరెలోని సమీపంలో ప్రయాణిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు టైం రాత్రి 11:30 గంటలు. పోలీస్ ట్రక్కు డ్రైవర్ ను అరెస్టు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిపై మంత్రి స్పందిస్తూ, ‘‘ప్రమాదం తీరును పరిశీలిస్తే నాపై హత్యాయత్నమే. లారీ డ్రైవరు ఉద్దేశపూర్వకంగానే నా కారును ఢీకొట్టబోయి, అందుకు అవకాశం లేకపోవడంతో ఎస్కార్టు వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ తీవ్రతకు ఎస్కార్టు వాహనంలో సిబ్బంది గాయపడ్డారు. ట్రక్ డ్రైవర్ ఆల్కహాల్ సేవించి నడుపుతున్న దాఖలాలు లేవు. అతను మామూలు స్థితిలోనే ఉన్నాడు’’ అని మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే ఆరోపించారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని, పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని 'కుట్రదారులను' బహిర్గతం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.