పనాజీ: సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ ప్రసున్ జోషి టెలివిజన్ డిబేట్‌లో ఒక అంశాన్ని తీసుకున్నారు. న్యూస్ ఛానళ్లను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ, అంతూపొంతూ లేకుండా సాగుతున్న టీవీ చర్చా కార్యక్రమాలు.. దేశంలో భాషా ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు. 'వాదనలు వింటూ.. వాదనలు గెలవడంలో దేశం కొత్త మార్గం కనుక్కోవలసి ఉంటుంది' అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మేము ఈ దేశాన్ని నిజంగా ప్రజాస్వామ్యంగా ఉంచాలని భావిస్తున్నాము. వాదనలు విని.. వాదనలు గెలవడంలో దేశం కొత్త మార్గం కనుగొనవలసి ఉంటుంది. కొందరు చర్చల్లో గెలవడమే లక్ష్యంగా వాదిస్తుంటారు. అలాంటివారి ముందు విషయపరిజ్ఞానం ఉన్నవారు కూడా డీలా పడతారు. ఎదుటివారు మొదలుపెట్టే లోపే మాటల దాడి చేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఒక రకమైన భాషా తీవ్రవాదం" అని జోషి చెప్పారు.


ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో "ఇండియా ఐడియాస్ కాన్క్లేవ్ 2017"లో భాగంగా జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్మన్ జోషి పాల్గొన్నారు. డిసెంబరు 15న ప్రారంభమైన మూడు రోజుల సదస్సు నేటితో ముగుస్తుంది.