Twitter War: కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్‌కు మధ్య ప్రఛ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ పోలీసులతో వైరం ప్రారంభమైంది. ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్‌కు హాజరు కావల్సిందేనని యూపీ పోలీసులు తేల్చి చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వానికి (Central government) ఇప్పటికే వార్ నడుస్తోంది. కొత్త ఐటీ నిబంధనలు ( New IT Rules) పాటించే విషయంలో ట్విట్టర్‌తో వార్ ప్రారంభమైంది. నిబంధనల్ని పాటించలేదనే కారణంతో ఇప్పటికే కేంద్రం ట్విట్టర్‌కు మధ్యవర్తిత్వ హోదా తొలగించింది. ఫలితంగా ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వృద్ధుడిపై దాడి ఘటన 
ట్విట్టర్‌ను(Twitter)ఇరకాటంలో పెట్టింది. వృద్ధుడిపై కొందరు దాడి చేయగా..ఈ ఘటనకు మతం రంగు పులమాలని కొందరు ప్రయత్నించారని..ట్విట్టర్ కారణంగా ఆ వీడియోలు వైరల్ అయ్యాయని..ట్విట్టర్ నిర్లక్ష్యమే కారణమని యూపీ పోలీసులు(Up police) ఆరోపించారు. ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి నోటీసులు పంపించారు. అయితే ఈ వివాదాలతో తనకు సంబంధం లేదని..తాను డీల్ చేయనని మనీష్ పోలీసులకు వివరణ ఇచ్చాడు. దీనికి సంతృప్తి చెందని యూపీ ఘజియాబాద్ పోలీసులు విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపించారు. అయితే వర్చువల్ విచారణకు తాను సిద్ధమని మనీష్ ప్రకటించగా..పోలీసులు కుదరదని తేల్చి చెప్పారు. ఈ నెల 24వ తేదీన పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావల్సిందేనని చెప్పారు. విచారణకు హాజరుకాకపోతే..చట్టబద్ధంగా చర్యలు తీసుకోవల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 26 సార్లు నోటీసులు పంపించామనేది పోలీసుల వాదనగా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం(Central government) ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న వివాదంతో ట్విట్టర్ ఇప్పుడు కష్టాల్లో పడింది.


Also read: Yoga History: యోగా పుట్టింది ఇండియాలో కాదంట..నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook