Snowfall: కేదార్ నాథ్ లో భారీగా హిమపాతం, చిక్కుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు
కేదార్ నాథ్ ఆలయం పరిసరాల్లో భారీగా కురుస్తున్న హిమపాతంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిక్కుకుపోయారు. హెలీకాప్టర్ సర్వీసులు నిలిచిపోవడంతో ఇద్దరూ అక్కడే ఉండిపోవల్సి వచ్చింది.
కేదార్ నాథ్ ఆలయం ( Kedarnath temple ) పరిసరాల్లో భారీగా కురుస్తున్న హిమపాతంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిక్కుకుపోయారు. హెలీకాప్టర్ సర్వీసులు నిలిచిపోవడంతో ఇద్దరూ అక్కడే ఉండిపోవల్సి వచ్చింది.
హిమాలయాల్లో ( Himalayas ) భారీగా హిమపాతం ( Heavy snowfall ) ప్రారంభమైంది. శీతాకాలం ప్రారంభ సమయంలో హిమపాతం ఎక్కువ కావడంతో కేదార్ నాథ్ ఆలయాన్ని ( kedarnath temple ) సైతం మూసివేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కేదార్ నాథ్ కు చేరుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ( Uttarakhand cm trivendra singh rawat ), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Up cm yogi adityanath ) లు కేదార్ నాథ్ లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని స్వయంగా ఉత్తరాఖండ్ డీజీ అశోక్ కుమార్ వెల్లడించారు.
స్నో ఫాల్ అధికంగా ఉన్న కారణంగా హెలీకాప్టర్ సర్వీసులు నిలిచిపోయాయని..దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులు కేదార్ నాథ్ లోనే ఉండిపోవల్సి వచ్చిందని డీజీ అశోక్ కుమార్ ( uttarakhand DG Ashok kumar ) స్పష్టం చేశారు. హిమపాతం కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేశారు. భాయ్ దూజ్ కార్యక్రమం తర్వాత ఆలయ ద్వారాలను మూసివేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు దేవస్థానం బోర్డు అధికారులు, పూజారులు కూడా ఆలయంలో ప్రార్ధనలు చేసేందుకు, కేదార్ పురిలో జరుగుతున్న నిర్మాణ పనుల్ని పర్యవేక్షించేందుకు ఇక్కడికి చేరుకుని..చిక్కుకుపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి
Also read: Bihar: ముఖ్యమంత్రిగా నితీష్..ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతల ప్రమాణం