ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒకరి కంటే ఎకరు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ  మధ్యే ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు రోజుల క్రితం బీజేపీ మోడల్ టౌన్ అభ్యర్థి కపిల్ మిశ్రా చేసిన ట్వీట్ .. రాజకీయ రగడకు కేంద్ర బిందువుగా మారింది. ఫిబ్రవరి 8న ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటూ ఆయన చేసిన ట్వీట్ .. అగ్గి రాజేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన ట్వీట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం . .  కపిల్ మిశ్రాపై ఎఫ్ఐర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 


మరోవైపు మరో అడుగు ముందుకేసిన  ఎన్నికల సంఘం బీజేపీ అభ్యర్థి  కపిల్ మిశ్రాపై రెండు రోజుల ప్రచార నిషేధం విధించింది.  ఈ ఆదేశం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడి అవుతాయి.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..