Gyanvapi Masjid Survey: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో సర్వే పూర్తయింది. సర్వేకు సంబంధించి పూర్తిగా వీడియోగ్రఫీ తీశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్‌లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే మూడవ రోజు కూడా కొనసాగింది. పశ్చిమ దీవార్ ప్రాంతంలో వీడియాగ్రఫీతో సర్వే పని పూర్తయింది. మసీదు ప్రాంగణంలోని గుంబజ్‌ల సర్వే నిర్వహించారు. దీనితో పాటు మూడు గదులు, ఒక హాల్‌లో కూడా సర్వే నిర్వహించారు. మూడ్రోజుల్నించి నడిచిన సర్వే పూర్తవడంతో అధికారికంగా వివరాలు వెల్లడి కావల్సి ఉంది. 


ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో ఉన్న జ్ఞానవాపి మసీదుపై గత కొద్దికాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదాస్పద ప్రాంతంలో శివుడి ఆలయం ఉందనేది ఓ వర్గం వాదన. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు రెండ్రోజుల్నించి సర్వే నడుస్తోంది. ఇవాళ మూడవ రోజు సర్వే కూడా దాదాపుగా పూర్తయింది. కీలకమైన పశ్చిమ గోడ ప్రాంతంలో రెండవ రోజు సర్వేను వీడియోగ్రఫీతో సహా పూర్తి చేశారు. ముందురోజు పైభాగంలోని పశ్చిమ గోడ సర్వే పూర్తయింది. అటు గుంబజ్‌ల సర్వే కొనసాగుతోంది.


మరోవైపు వారణాసి కోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై రేపు విచారణ జరగనుంది. మరోవైపు రెండవరోజు సర్వేలో శివలింగం బయటపడిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారికంగా వెల్లడి కావల్సి ఉంది. 


Also read: Railway Jobs 2022: భారీగా రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ, ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఎప్పుడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook