Railway Jobs 2022: ఐటీఐ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. భారతీయ రైల్వేలో భారీగా అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇందులో భాగంగా రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2022 జారీ అయింది.
భారతీయ రైల్వేలో కొత్తగా 2 వేల 927 అప్రెంటిస్ ఖాళీల్ని భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. మే 20 తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అర్ఙులైన అభ్యర్ధులు ఈస్టర్న్ రైల్వే వెబ్‌సైట్ er.indianrailways.gov.in నుంచి అప్లై చేసుకోవడం లేదా నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రైల్వే నుంచి ఐటీఐ సర్టిఫికేట్ తీసుకున్న విద్యార్ధులకు ఇది మంచి అవకాశం. ఈస్టర్న్ రైల్వే 2 వేల 927 అప్రెంటిస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 20వ తేదీ చివరితేదీ. మెరిట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అప్రెంటిస్ సమయంలో ఎంపికైన అభ్యర్ధులకు ప్రతి నెలా స్టైపెండ్ ఉంటుంది. అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పాస్ అయుండాలి. దీంతోపాటు ఎన్సీవీటీ లేదా ఎన్సీవీటీ సమాన ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. కనీస వయస్సు 15 నుంచి 24 ఏళ్లలోపుండాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత పదవ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్ధుల మెరిట్ జాబితా సిద్ధం చేస్తుంది. తుది జాబితాలో స్థానం సంపాదించుకున్న అభ్యర్ధులకు అప్రెంటిస్ కోసం ఎంపిక చేస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగరీ అభ్యర్ధులకు వంద రూపాయలు ఫీజు కాగా, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఏ విధమైన రుసుము లేదు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులైన అభ్యర్ధులు ఈస్టర్న్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ er.indianrailways.gov.in సందర్శించాలి. ఇందులో మీకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ లింక్ లభిస్తుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
Also read: Indian Railways: మీ రైలు ప్రయాణ తేదీని ఎలా మార్చుకోవాలి, అలా చేస్తే టికెట్ రద్దవుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook