హుబ్లి: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటకలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ఆదివారం కర్ణాటకలోని హుబ్లిలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు రోడ్డుపై ఏరులైపారింది. ఆ వర్షపు వరద నీటి ప్రవాహం ధాటికి రోడ్డుపై పార్క్ చేసి వున్న ఓ బైక్ సైతం కిందపడి ప్రవాహంలో కొట్టుకుపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంత బరువైన ద్విచక్రవాహనం పేపర్ బోటులా నీటిలో కొట్టుకుపోతుంటే అలా చూస్తూ ఉండిపోవడం స్థానికుల వంతయ్యింది.