కూతుళ్ల పెళ్లిళ్లకు డబ్బులు లేక హత్య చేశాడు
కూతుళ్ల పెళ్లిళ్లకు డబ్బులు లేక హత్య చేశాడు
కన్న కూతుళ్ల పెళ్లిళ్లకు డబ్బులు లేకపోవడంతో.. తీవ్ర ఒత్తిడికి గురైన ఓ తండ్రి వారిని హత్య చేయడం కలకలం రేపింది.
న్యూఢిల్లీలోని సంగం విహార్‌లో ఉంటున్ననంద్ కిషోర్ అనే వ్యక్తి తన భార్య కూతుళ్లతో కలిసి ఉంటున్నాడు. సైకిల్ షాపు నడపడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్న కిషోర్.. పెళ్లీడుకు వచ్చిన కూతుళ్లకు పెళ్లి చేసేందుకు డబ్బులు కావాలనే ఒత్తిడితో హత్యలు చేసినట్లు, కుటుంబ సభ్యులను గాయపర్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. నిందితుడు కిషోర్ భార్య విద్యావతి, కూతుళ్లు కవిత (22), సుమన్(24)లను ఐరన్ రాడ్‌తో బలంగా కొట్టాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కిషోర్ ముగ్గురు కొడుకులు వేరే గదిలో ఉన్నారన్నారు.
తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. కవిత చనిపోయినట్లు, విద్యావతి, కుమార్తె సుమన్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
కిషోర్‌కి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె వివాహం కాగా.. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిపించాల్సి ఉంది.
పెళ్లీడుకు వచ్చిన కూతుళ్లకు పెళ్లి చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన కిషోర్ కుటుంబసభ్యుల మీద దాడికి పాల్పడినట్లు సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.