Unemployment Allowance: ఆ రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.2500
Unemployment Allowance Scheme in Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి పథకం నెలకు రూ.2500 అందజేస్తోంది. ఈ స్కీమ్‌కు ఎవరు అర్హతలు..? ఏ సర్టిఫికేట్లు కావాలి..? వివరాలు ఇలా..
Unemployment Allowance Scheme in Chhattisgarh: నిరుద్యోగులకు ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. తాజాగా నిరుద్యోగ భృతిని ప్రకటించింది. నిరుద్యోగులు, ఎలాంటి ఉపాధిని చేయని వారిని అర్హులని తెలిపింది. ఈ పథకం కింద నెలకు రూ.2500 అందజేస్తామని వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిరుద్యోగ భృతి పథకాన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి భృతిగా రూ.2500 అందజేస్తోంది. అయితే నిరుద్యోగభృతి అందరికీ వర్తించదు. ఇందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అవేంటంటే..
==> నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
==> 12వ పరీక్షలో కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి
==> ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారే అర్హులు.
==> కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల రూపాయలకు మించకూడదు.
==> ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
నిరుద్యోగ భృతి పథకానికి ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవడానికి మొబైల్ నంబర్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబరు తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు జమ అవుతాయి.
ఈ పత్రాలు అవసరం..
==> ఎంప్లాయిమెంట్ నమోదు కార్డు
==> 10వ, 12వ మార్కుషీట్
==> ఇన్‌కమ్ సర్టిఫికేట్
==> నివాస ధృవీకరణ పత్రం
==> పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
Also Read: Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై
Also Read: New Releases This Weekend on OTT: ఓటిటిలో ఈ వారం కొత్త సినిమాలు.. నాన్-స్టాప్ ఫన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి