New Releases This Weekend on OTT: ఓటిటిలో ఈ వారం 10 కొత్త సినిమాలు.. ఫుల్ నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంట్

New Releases This Weekend on OTT From Adhura to IB 71 Movie: ఓటిటిలో ఈ వీకెండ్ ఫుల్ నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ తో అద్దిరిపోనుంది. అవును.. ఒకటి కాదు.. రెండు కాదు.. సినిమాలు, వెబ్ సిరీస్ లు కలిపి ఏకంగా 10 షోలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. అవి ఏంటి అనేది ఈ డీటేల్స్‌లో చూద్దాం రండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2023, 01:13 AM IST
New Releases This Weekend on OTT: ఓటిటిలో ఈ వారం 10 కొత్త సినిమాలు.. ఫుల్ నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంట్

New Releases This Weekend on OTT From Adhura to IB 71 Movie: ఓటిటిలో ఈ వీకెండ్ ఫుల్ నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ తో అద్దిరిపోనుంది. అవును.. ఒకటి కాదు.. రెండు కాదు.. సినిమాలు, వెబ్ సిరీస్ లు కలిపి ఏకంగా 10 షోలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. అవి ఏంటి అనేది ఈ డీటేల్స్‌లో చూద్దాం రండి. 

అధుర : అధుర వెబ్ సిరీస్ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కింది. నీలగిరి వ్యాలీ స్కూల్ లో చదువుకోవడానికి వచ్చిన ఒక 10 ఏళ్ల పిల్లాడి వింత ప్రవర్తన సినిమాను గతంలోకి తీసుకెళ్తుంది. ఆత్మల చుట్టూ తిరిగే ఈ కథ హారర్ ప్రియులను ఎంతో థ్రిల్లింగ్ కి గురిచేసేలా ఉంటుంది అని ఇటీవలే రిలీజైన అధుర ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. జూలై 7 నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవనుంది. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి.

స్వీట్ కారం కాఫీ : అమేజాన్ ప్రైమ్ వీడియోలోనే జూలై 6న రిలీజైన ఈ వెబ్ సిరీస్ కథాంశం విషయానికొస్తే.. స్వేచ్చను కోరుకునే మూడు తరాలకు చెందిన ముగ్గురు వేర్వేరు మహిళలు ఒక్క చోట కలిసి ఉంటే వారి జీవిత ప్రయాణం ఎలా ఉంటుంది ? ఆ ప్రయాణంలో వారికి ఎదురైన అనుభవాలు ఏంటి అనే అంశాలతో తెరకెక్కించిన కథనం ఇది. సీనియర్ నటి లక్ష్మి, మధుబాల, శాంతి బాలచంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 

IB 71 : 1971 ఇండో - పాకిస్థాన్ వార్ నేపథ్యంతో తెరకెక్కిన మూవీ ఇది. బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్ వాల్ ద్విపాత్రిభినయం చేశాడు. ఇండో - పాక్ వార్ సమయంలో గూఢచారుల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో జామ్ వాల్ ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఏజెంట్ పాత్రలో నటించాడు. ఇండో - పాక్ వార్ లో సమాధి అయిన రహస్యమే ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకున్నట్టు అర్థం అవుతోంది. జూలై 7న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో IB 71 విడుదల కానుంది.  

శుభ్ యాత్ర : శుభ్ యాత్ర మిమ్నల్ని ఒక నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. గుజరాతీల నేపథ్యంతో తెరకెక్కిన కథ ఇది. అమెరికా వెళ్లాలని కలలు కనే ఇద్దరు గుజరాతీలు అందుకోసం ఏం చేశారు, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ తో వారికి ఎదురైన ఇబ్బందులు ఏంటనేదే కథాంశం. మధ్యలో అసలు భయం అంటే ఏంటో తెలియని రిపోర్టర్ పాత్రలో మోనాల్ గజ్జర్ ఎంట్రీ ఇస్తుంది. తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన ఫేస్ కావడంతో మోనాల్ పాత్రకు కూడా తెలుగు ఆడియెన్స్ ఈజీగానే కనెక్ట్ అయిపోతారు. షెమారుమి ఓటిటి ప్లాట్ ఫామ్ లో శుభ్ యాత్ర జూలై 6న విడుదలైంది. 

ఫరానా : కుటుంబానికి ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవాలనే బలమైన కోరికతో ఫరానా అనే ఒక మిడిల్ క్లాస్ మదర్ ఒక కాంటాక్ట్ సెంటర్ లో ఉద్యోగం సంపాదిస్తుంది. అంతటితో ఆగని ఆమె ఇంకాస్త ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఆశతో తను చేసే ఉద్యోగంలోనే మరో విభాగానికి మారుతుంది. కానీ అక్కడి నుంచే ఫరానా జీవితం అసలైన టర్న్ తీసుకుంటుంది. అధిక డబ్బు స్థానంలో అధిక కష్టాలు వచ్చిపడుతాయి. ఒకానొక దశలో తన జీవితమే కాకుండా తన కుటుంబం కూడా డేంజర్లో పడుతుంది. మరి ఆ కష్టాల నుంచి ఫరానా ఎలా బయటపడింది అనేదే ఫరానా కథాంశం. సోని లివ్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో జూలై 7 నుంచి ప్రీమియర్ కానుంది.

ఫెటల్ సిడక్షన్ : కామ వాంఛలు మనిషి జీవితాన్ని ఎంత దూరం తీసుకెళ్తాయో చెప్పే స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కిన ఫెటల్ సిడక్షన్‌లో లవ్, లస్ట్, రిలేషన్‌షిప్స్ సీక్రెట్స్ వంటి ఆసక్తిరేకెత్తించే ఎన్నో అంశాలు ఒకదానినొకటి పెనవేసుకుని ఉంటాయి. ఫెటల్ సిడక్షన్ స్టోరీ గురించి మరింత తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 7న ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ షోను వీక్షించాల్సిందే.

తర్లా : తర్లా దలాల్ అనే మహిళ అతి సాధారణ స్థాయి నుంచి దేశంలోనే ఫేమస్ చెఫ్ స్థాయికి ఎదిగిన తీరు చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. తర్లా దలాల్ పాత్రలో హుమా ఖురేషి నటించింది. జూలై 7న ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ జీ5 లో విడుదల కానుంది. 

బ్లైండ్ : జియో సినిమాలో జూలై 7 బ్లైండ్ రిలీజ్ కానుంది. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇందులో కళ్లు లేని మహిళ పాత్రలో కనిపించనుంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఈ కథ సస్పెన్స్, థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది.

Trending News