Railway Ticket Discount: భారతీయ రైల్వే దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉంది. రోజుకు కోట్లాదిమంది ప్రయాణీకులు రైల్వేపైనే ఆధారపడుతుంటారు. దేశంలో అత్యధిక జనాభా రైల్వే ప్రయాణాలపైనే ఆధారపడుతుంటారు. రేపు కేంద్ర బడ్జెట్ పై రైల్వే ప్రయాణీకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు రైల్వే బడ్జెట్ కోసం చూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేపు జూలై 23న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపధ్యంలో రైల్వేకు సంబంధించి ఎలాంటి అంశాలు ప్రాధాన్యత ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రైల్వే ప్రయాణీకులు ఈసారి చాలా అంచనాలు పెట్టుకున్నారు ప్రధానంగా సీనియర్ సిటిజన్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. రైల్వే టికెట్ ధరల్లో సీనియర్ సిటిజన్లకు గతంలో ఇచ్చిన రాయితీని కరోనా సమయంలో తొలగించేశారు. ఇప్పుడు ఆ రాయితీని పునరుద్ధరించాలని గత రెండేళ్లుగా కోరుతున్నారు. 2019 వరకూ సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు దాటినవారికి 4 శాతం టికెట్ డిస్కౌంట్ ఉండేది. 2020 నుంచి కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్ధిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల రాయితీలు తొలగించేశారు. ఇప్పటి వరకూ తిరిగి ఆ రాయితీలను పునరుద్ధరించలేదు. 


ఈసారి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ఆ రాయితీని తిరిగి ప్రకటిస్తారని సీనియర్ సిటిజన్లు ఆశిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు మరోసారి 50 శాతం టికెట్ డిస్కౌంట్ ఇవ్వాలని కోరుతున్నారు. గత రెండు బడ్జెట్ల నుంచి ఈ డిమాండ్ ఉన్నా ఈసారి తప్పకుండా నెరవేర్చవచ్చని తెలుస్తోంది. 


మరో వైపు సారి బడ్జెట్ లో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మెట్రో నెట్వర్క్ విస్తరణకు నిధులు పెంచడం, నమో భారత్ కారిడార్, వందేభారత్ రైళ్లు, హై స్పీడ్ కారిడార్, ఎకనామిక్ కారిడార్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వచ్చని తెలుస్తోంది. అదే విధంగా రైల్వే టికెట్ల విషయంలో కాస్త ఉపశమనం కల్గించవచ్చని అంచనా. 


Also read: Nissan X Trail SUV: Fortuner పోటీ వచ్చేసింది..నిస్సాన్ నుంచి సరికొత్త Nissan X Trail, ఫీచర్లు ధర ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook