Nissan X Trail SUV: Fortuner పోటీ వచ్చేసింది..నిస్సాన్ నుంచి సరికొత్త Nissan X Trail, ఫీచర్లు ధర ఎంతంటే

Nissan X Trail SUV: దేశంలోని టాప్ ఎండ్ కార్లలో ఒకటి ఫార్చ్యూనర్ కారుకు ఇప్పటివరూ తిరుగులేదు. ఇప్పుడీ కారుకు పోటీ వచ్చేసింది. నిస్సాన్ సరికొత్త మోడల్ లాంచ్ చేయనుంది. నిస్సాన్ కంపెన నుంచి త్వరలో వస్తున్న X Trail ఆటోమొబైల్ రంగంలో గేమ్ ఛేంజర్ కానుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 21, 2024, 01:47 PM IST
Nissan X Trail SUV: Fortuner పోటీ వచ్చేసింది..నిస్సాన్ నుంచి సరికొత్త Nissan X Trail, ఫీచర్లు ధర ఎంతంటే

Nissan X Trail SUV: నిస్సాన్ ఇండియా చాలా కాలం తరువాత మరో కారును ప్రవేశపెడుతోంది. ఈసారి ఏకంగా ఫార్చ్యూనర్ కారుకు పోటీ ఇచ్చేందుకు సిద్దమైంది. టాప్ ఎండ్ లగ్జరీ విభాగంలో తిరుగులేని ఫార్చ్యూనర్ కారుకు Nissan X Trail సవాలు విసరనుంది. ఈ కారు ఫీచర్లు, ధర గురించిన వివరాలు లీకయ్యాయి. 

Nissan X Trail  అనేది మూడు వరుసల SUV. ఈ కారు 7 సీటర్ విభాగంలో వస్తోంది. ఇందులో 1.5 లీటర్ 3 సిలెండర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 12 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ కారులో ఇంజన్ తో పాటు సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అమర్చారు. ఈ కారు ఇంజన్ 163 బీహెచ్ పి పవర్, 300 ఎన్ ఎం టర్క్ జనరేట్ చేస్తుంది. ఇక ఈ కారు డిజైన్ అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో డార్క్ క్రోమ్, ఎల్ ఈడీ డీ ఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఎల్ ఈడీ టెయిల్ ల్యాంప్ తో వి మోషన్ గ్రిల్ ఉంటుంది. ఈ కారు పొడవు 4680 మిల్లీమీటర్లు కాగా వెడల్పు 1840 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇక ఎత్తు 1725 మిల్లీమీటర్లు. వీల్ బేస్ 2705 మిల్లీమీటర్లు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిల్లీమీటర్లుగా ఉంది. 

Nissan X Trail  కారులో 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 360 డిగ్రీ కెమేరా, 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, పుష్ స్టార్ట్ బటన్, కీ లెస్ ఎంట్రీ, డ్యూయల్ పాన్ పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ జోన్ క్లైమేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దాంతోపాటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్ ఫీచర్లు ఉన్నాయి. 

Nissan X Trail  కారు వైట్, గ్రే, బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. సేఫ్టీ కోసం 7 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చింది కంపెనీ. అంతేకాకుండా ట్రాక్షన్ కంట్రోల్, ఈబీడీ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటో వైపర్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి. ఈ కారు పూర్తిగా బిల్ట్ అప్ యూనిట్ గా ఇండియాలో దిగుమతి కానుంది. కచ్చితంగా ఈ కారు స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్, జీప్ మెరిడియన్, టొయోటా ఫార్చ్యూనర్ లతో పోటీ పడనుంది. ఈ కారు లాంచ్ తేదీ ఇంకా తెలియదు. ధర మాత్రం 40-45 లక్షల మధ్యలో ఉండవచ్చు.

Also read: Telangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News