Amit Shah: ఎయిమ్స్ నుంచి కేంద్ర హోంమంత్రి డిశ్చార్జ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అమిత్ షా కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్ ( AIIMS ) లో చేరారు.
Amit Shah discharged from AIIMS: న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అనంతరం అమిత్ షా కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్ ( AIIMS ) లో చేరారు. చికిత్స అనంతరం ఆయన సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన కోలుకున్నట్లు ఎయిమ్స్ వైద్యులు సైతం శనివారం ప్రకటించారు. Also read: AP: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా
ఇదిలాఉంటే.. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా సోకగా.. గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత 14వ తేదీన ఆయనకు కరోనా నెగిటివ్ రాగా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న అమిత్ షాకు శ్వాసకోశ సమస్య, తదితర అనారోగ్య పరిస్థితలు తలెత్తడంతో 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు