Union Minister Piyush Goyal clarifies on Telangana paddy procurement : వరి కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కావాలనే గందరగోళం సృష్టిస్తుందంటూ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కేకే అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Union Minister Piyush Goyal) వివరణ ఇచ్చారు. ఖరీఫ్‌ సీజన్‌ తర్వాత యాసంగి గురించి ఆలోచిద్దామని పీయూష్‌ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా యాసంగిలో తెలంగాణలో కేవలం బాయిల్డ్ రైస్‌ (Boiled Rice) మాత్రమే వస్తాయని కేకే పేర్కొన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌ కొనేటట్లు అయితే ఎంత కొంటుందో క్లారిటీ ఇవ్వాలంటూ కేకే కోరారు. రకాలతో సంబంధం లేకుండా వరి కొనుగోలు చేయాలని కోరారు. 


అయితే తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. వినియోగించే గలిగే ధాన్యాన్నే కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో (CM KCR‌) కూడా మాట్లాడానని స్పష్టం చేశారు. వర్షాకాలం పంట పూర్తిగా కొంటామని వెల్లడించారు. 


Also Read : AP PRC: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్​ న్యూస్​- త్వరలోనే పీఆర్సీ!


ఇక ఖరీఫ్‌లో 50లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ సర్కార్.. 32.66 లక్షల టన్నులు ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ నుంచి మొదట.. 24 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనేందుకు ఒప్పందం జరిగిందని.. దాన్ని 44లక్షల టన్నులకు పెంచామని చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ (Telangana) నుంచి ఇప్పటి వరకు 27లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ వచ్చిందని, ఇంకా 17లక్షల టన్నులు పెండింగ్‌ లో ఉందని పేర్కొన్నారు. 


ఇక భవిష్యత్తులో తెలంగాణ (Telangana) నుంచి బాయిల్డ్‌ రైస్‌ (Boiled rice) కొనమని తాము ముందుగానే చెప్పామని మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. అలాగే ఇకపై బాయిల్డ్‌ రైస్‌ పంపమని అక్టోబర్‌ 4న తెలంగాణ ప్రభుత్వ లేఖ రాసిందని చెప్పుకొచ్చారు. అయితే యాసంగి ధాన్యం విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రాజకీయం చేస్తోందో అర్థం కావట్లేదన్నారు.


Also Read : Harish Rao: 'ఒమిక్రాన్​ ఎదుర్కొనేందుకు రెడీ- ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook