Harish Rao: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తెలంగాణలోకి రాలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రజలవెవ్వరు అనవసరంగా ఆందోళన చెందొద్దని సూచించారు. 11 అనుమానిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించి.. నెగెటివ్‌గా తేలితేనే ఇళ్లకు (COVID test in Hyderabad Airport) పంపిస్తున్నట్లు వివరించారు. పాజిటివ్‌గా తేలితే అక్కడి నుంచి నేరుగా టిమ్స్ దవాఖానకు పంపిస్తున్నట్లు వెల్లడించారు హరీశ్.
సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన హరీశ్ రావు. ఈ విషయాలను పంచుకున్నారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు (Health minister Harish Rao) హరీశ్ రావు. 15వ ఆర్థిక సంఘం కూడా దేశమంతా ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించినట్లు గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో 258 బస్తీ దవాఖానలు..
బస్తీల్లో ఉండే సుస్తీని దూరం చేసేవే బస్తీ దవాఖానాలు (Basti Dawakana) అని హరీశ్ చెప్పుకొచ్చారు. ఇవాళ ఒక్క రోజే 32 కొత్త బస్తీ దవాఖానాలను ప్రారంభించినట్లు వివరించారు. ఇది వరకే 226 దవాఖానలు అందుబాటులో ఉన్నట్లు (Total Basti Dawakanas in Hyderabd) వెల్లడించారు.
హైదరాబాద్‌లో బస్తీ దవఖానల మోడల్ పెట్టాలని జిల్లాల నుంచి కూడా డిమాండ్ వస్తున్నట్తు హరీశ్ వివరించారు. దీనితో రానున్న రోజుల్లో 144 బస్తీ దవాఖానలను రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
బస్తీ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని.. అందుకే అనవసరంగా ప్రైవేటుకు వెళ్లొద్దని సూచించారు హరీశ్ రావు. హైదరాబాద్‌లో 20 టీ డయాగ్నోస్టిక్ సెంటర్లను పెట్టినట్లు వివరించారు. బస్తీ దవాఖానల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా పరీక్షలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Inauguration of Basthi Dawakhana, at Old Bowenpally, Secundrabad. #BasthiDawakhana https://t.co/7VBuu5lNvR
— Harish Rao Thanneeru (@trsharish) December 3, 2021
ఒమిక్రాన్ ఎదుర్కనేందుకు సిద్ధమే.. కానీ..
రాష్ట్రంలోకి ఇంకా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ రాలేదని స్పష్టం చేసిన (Omicron in Telangana) హరీశ్ రావు. ఒక వేళ ఒమిక్రాన్, థార్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలిందని.. అయితే అమెకు ఒమిక్రాన్ సోకిందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది పేర్కొన్నారు.
మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్‌లు ధరించడం, శుభ్రంగా ఉండటం, టీకాలు వేసుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చని తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇక కరోనా ఎదుర్కొనేందుకు.. ఐసీయూ, ఆక్సిజన్ సదుపాయాలలతో కూడిన 27 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు హరీశ్.
అర్హులంతా టీకా వేసుకోవాలి..
రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కరోనా టీకా వేసుకోవాలని సూచించారు. టీకా వేసుకోని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిటి వాక్సిన్ తీసుకునేలా చేయాలని బస్తీల పెద్దలకు సూచించారు. తెలంగాణ వ్యాప్తంగ ఇప్పటి వరకు 2 కోట్ల 51 లక్షల మంది మొదటి డోస్ వేసుకున్నట్లు తెలిపారు. అంటే దాదాపు 91 శాతం మందికి ఫస్ట్ డోస్ పూర్తయినట్లు వివరించారు. కోటు 32 లక్షల మంది రెండో డోసు టీకా వేసుకున్నట్లు వివరించారు హరీశ్.
Also read: Telangana: గురుకులంలో కరోనా కలకలం..29 మంది విద్యార్థినులకు పాజిటివ్!
Also read: Face Mask Mandatory: 'మాస్క్ లేకుండా బయటికొస్తే రూ.1000 జరిమానా': తెలంగాణ ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook