UPSC 2023: యూపీఎస్సీ 2023 క్యాలెండర్ విడుదల... సివిల్స్ సహా ఇతర పరీక్షల ముఖ్య తేదీలివే...
UPSC Calender 2023: వచ్చే ఏడాది నిర్వహించే సివిల్స్ సహా ఆయా పరీక్షా తేదీల క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది.
UPSC Calender 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2023 క్యాలెండర్ విడుదలైంది. 2023 సంవత్సరానికి గాను యూపీఎస్సీ నిర్వహించే ఆయా పరీక్షల తేదీలను ఇందులో వెల్లడించారు. దీని ప్రకారం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమనరీ ఎగ్జామ్‌ను మే 28, 2023న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సివిల్ సర్వీస్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు ఫిబ్రవరి 21, 2023.
యూపీఎస్సీ 2023 క్యాలెండర్... ముఖ్య తేదీలు :
ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2023 : ఫిబ్రవరి 19, 2023
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నావల్ అకాడమీ (NA) ఎగ్జామ్ I : ఏప్రిల్ 16, 2023
సీడీఎస్ ఎగ్జామ్ (I), 2023 : ఏప్రిల్ 16, 2023
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్ 2023 : మే 28, 2023
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్ 2023 : మే 28, 2023
ఐఈఎస్/ఐఎస్ఎస్ ఎగ్జామ్ 2023 : జూన్ 23, 2023
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ (మెయిన్స్) 2023 : జూన్ 24, 2023
ఇంనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామ్ 2023 : జూన్ 25, 2023
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 : జులై 16, 2023
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (ACs) ఎగ్జామ్ 2023 : ఆగస్టు 6, 2023
సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) ఎగ్జామ్ 2023 : సెప్టెంబర్ 15 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్స్) ఎగ్జామ్ 2023 : నవంబర్ 26 నుంచి 10 రోజుల పాటు నిర్వహిస్తారు.
వచ్చే ఏడాది యూపీఎస్సీ సివిల్స్ సహా ఇతర పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ తేదీలను అనుసరించి తమ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. పరిస్థితులను బట్టి తాజా క్యాలెండర్‌లో పేర్కొన్న పరీక్షా తేదీల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి అభ్యర్థులు యూపీఎస్సీ అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ఫాలో కావాల్సి ఉంటుంది.
Also Read: Yashoda First Glimpse: ఆసుపత్రి బెడ్‌పై సమంత.. కిటికీలోంచి చేయి పెట్టి..!
Also Read: Tire Blast: భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలిపోయిన జేసీబీ టైరు.. ఇద్దరు మృతి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.