UPSC Lateral Entry Jobs: యూపీఎస్సీ బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. ఏ రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం లభిస్తుంది. ఈ సువర్ణ అవకాశానికి కావాల్సిన అర్హత ఇతర వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలన్నా ఎగ్జామ్‌ రాయాల్సిందే. అయితే, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ (UPSC) ప్రతి ఏటా సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇది కేంద్ర రిక్రూట్మెంట్‌ ఏజెన్సీ. తద్వార ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అయితే, యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీఎస్సీ బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. తద్వారా జాయింట్‌ సెక్రటరీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో జాబ్‌ పొందిన అభ్యర్థులకు కేంద్ర మంత్రిత్వశాఖలో ఉద్యోగం పొందవచ్చు. ఇందులో జాయింట్‌ సెక్రటరీ, డైరక్టర్‌ డిప్యూటీ సెక్రటరీ విభాగాల్లో దేశంలోని వివిధ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది.  ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు భర్తీ చేయనుంది. ఎంత జీతం పొందనున్నారో తెలుసుకుందాం.


యూపీఎస్సీ ఇటీవలె లేటరల్‌ ఎంట్రీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి ప్రైవేటు సెక్టార్‌, అంతర్జాతీయ లేదా మల్టీ నేషనల్‌ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులు. అంటే వీరు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్‌ రాయకుండానే జాయింట్‌ సెక్రటరీగా మంత్రిత్వశాఖలో జాబ్‌ కొట్టేయవచ్చు. ఈ లేట్టరల్‌ ఎంట్రీలో సెలక్ట్‌ అయిన అభ్యర్థులు కేంద్ర వివిధ మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాలు పొందవచ్చు.


Read more:  సోమవారం 19 రాఖీపూర్ణిమ.. బ్యాంకులకు సెలవు ఉందా? మీరూ తెలుసుకోండి..


అర్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూనివర్శిటీ, ప్రైవేటు కంపెనీలు అటానమస్‌ బాడీస్‌, అంతర్జాతీయ, మల్టీ నేషనల్‌ కంపెనీలు ఇతర పబ్లిక్‌ ప్రైవేటు సెక్టార్లలో పనిచేసేవారు అర్హలు. వీరి వయస్సు 40-55 మధ్య ఉండాలి. 7వ ఆర్థిక సంఘం ప్రకారం ఈ రిక్రూట్మెంట్‌లో ఎంపికైన వారిని 14 వ ఆర్థిక సంఘం పే లెవల్‌లో భర్తీ చేస్తారు. వీరికి డీఏతోపాటు రూ. 2,70,000 పొందుతారు. అంతేకాదు ట్రావెల్‌, ఇంటి అద్దె కూడా ఇస్తారు.


Read more: Kolkata murder case: మమత నువ్వు దిగిపో.. కోల్ కత్తా ఘటనపై నిప్పులు చెరిగిన నిర్భయ తల్లి..  


35-45 మధ్య వయస్సు ఉన్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరిని 13వ పే లెవ్‌లో భర్తీ చేస్తారు. డీఏతోపాటు వీరి ఆదాయం రూ. 2,30,000 ఇతర అలవెన్సులు ఉంటాయి. 32-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు డిప్యూటీ సెక్రటరీగా భర్తీ చేసి 12 వ పే లెవల్ జీతాలు అందిస్తారు. అంటే వీరికి డీఏతోపాటు రూ. 1,52,000 పొందుతారు. ఇందులో మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనుంది యూపీఎస్సీ.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి