Kolkata murder case: మమత నువ్వు దిగిపో.. కోల్ కత్తా ఘటనపై నిప్పులు చెరిగిన నిర్భయ తల్లి..

Nirbhaya mother ashadevi: కోల్ కతా ఘటనపై నిర్బయ తల్లి  ఆశాదేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో సీఎం మమతా పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి కూడా మమతా.. న్యాయంచేయలేకపోయాని ఆశాదేవీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Aug 17, 2024, 10:09 PM IST
  • రెచ్చిపోయిన నిర్భయ తల్లి..
  • మమతా పై సంచలన వ్యాఖ్యలు..
Kolkata murder case: మమత నువ్వు దిగిపో.. కోల్ కత్తా ఘటనపై నిప్పులు చెరిగిన నిర్భయ తల్లి..

Nirbhaya mother ashadavi sensational comments on mamata: కోల్ కతా ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తాజాగా, దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవీ స్పందించారు. కోల్ కతా ఘటనపై మమతా సరైన విధంగా చర్యలు తీసుకొలేదని ఆశాదేవీ విమర్శించారు. ఆగస్టు 9 న ఘటన తర్వాత.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. దుండుదులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో విధ్దంసం చేయడం కూడా.. మమతా వైఫల్యమన్నారు.  కేవలం ప్రజలను తప్పుదోవపట్టించేందుకు మాత్రం.. ఆమె నిరసనలు తెలియజేశారన్నారు. ఒక సీఎం స్థానంలో ఉండి.. న్యాయం చేయాల్సిన పోజిషన్ లో ఉండి.. నిరసనతెలియజేయడం ఏంటని కూడా మండిపడ్డారు.  వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.

కేవలం కొంత మంది నిందితుల్ని పట్టుకుని కేసును నీరు గార్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆశాదేవీ ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. ఒక మహిళ సీఎం అయి ఉండి కూడా.. జూనియర్ డార్టర్ ను న్యాయం చేయడంలో మమతా పూర్తిగా విఫలమయ్యారని కూడా ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా మమతా బెనర్జీ ఫెయిల్యూర్ అని మండిపడ్డారు. ఈ ఘటనపై తొందరగా దర్యాప్తు జరిపి నిందితుల్నికఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.

నిందితుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో ప్రవేశ పెట్టి మరణ దండన విధించాలని కూడా నిర్భయతల్లి ఆశాదేవీ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.   జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ చేసిన తమ నిరసనలు తెలియజేశారు. కేవలం అత్యవసర సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంచారు.  

ఇండియన్ మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ.. కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలన్నారు. ఆదుర్మార్గులకు వేసే శిక్షను చూసి.. భవిష్యత్యులో మరోకరు చేయాలంటేనే భయపడేలా ఉండాలన్నారు.  ఈ ఘటన అందర్ని కలిచి వేస్తున్నారు.  ఇదిలా ఉండగా.. ఆర్ జీ కర్ ఆస్పత్రిలో యువతిపై ఆగస్టు 9 న అత్యంత హేయమైన  ఘటన దేశంలో ప్రతి  ఒకర్ని కలిచివేసింది. దీనిపైన దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈనేపథ్యంలో ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆగస్టు 18 ఉదయం ఆరు గంటల వరకు తమ నిరసన తెలియజేస్తున్నారు.

నిర్భయ ఘటన..

డిసెంబర్ 16, 2012న కదులుతున్న బస్సులో 'నిర్భయ' సామూహిక అత్యాచారం,  చిత్రహింసలకు గురైన సంఘటన దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో, నిర్బయను.. విమానంలో మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ ఆమె డిసెంబర్ 29న ఆసుపత్రిలో మరణించింది.

Read more: Weather Forecast: తెలంగాణాలో రాగల మూడు రోజుల్లో కుండపోతవర్షం.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం..  

ఆరుగురు దోషులలో, ఒకరు సెప్టెంబర్ 2013 లో ఢిల్లీలోని తీహార్ జైలులోని తన సెల్‌లో ఉరివేసుకుని కనిపించారు. మరొకరు, నేరం జరిగినప్పుడు మైనర్, గరిష్టంగా మూడేళ్లు సంస్కరణ సదుపాయంలో గడిపిన తర్వాత డిసెంబర్ 2015లో విడుదలయ్యారు . అన్ని చట్టపరమైన  చర్యలు తీసుకుని, మిగిలిన నలుగురు దోషులను మార్చి 2020లో ఉరితీశారు.మరోవైపు ఆశాదేవీ మాట్లాడుతూ.. రేపిస్టులకు కోర్టుల నుండి 'త్వరగా శిక్ష'లు పడే విధంగా..కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వాలు 'సీరియస్' అయ్యేంత వరకు ఇలాంటి సంఘటనలు 'జరగుతూనే ఉంటాయని అన్నారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News