Unnatural sex with wife is not molestation says madhya pradesh highcourt: సాధారణంగా పెళ్లి తర్వాత భార్యభర్తలు ఆలోచన విధానంలో కొంత తేడాలుంటాయి. దీంతో కొన్నిసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొందరు భర్తలు మాత్రం పూర్తిగా షాడిస్టులుగా ప్రవర్తిస్తుంటారు. భార్యను ఇష్టమున్నట్లు వేధిస్తుంటారు. ముఖ్యంగా ఆమెను ఒక లైంగిక అవసరాలకు ఉపయోగించుకున్నట్లు ఉంటారు. తమకు మూడ్ వచ్చిందంటే భార్యను వేధిస్తుంటారు. వేళా పాళా లేకుండా లైంగికంగా హింసిస్తుంటారు. భార్య పనిఒత్తిడితో విసిగిపోయిన కూడాతమ కోరికను తీర్చాలంటూ కూడా షాడియం చూపిస్తుంటారు. దీంతొ కొందరు భార్యలు, ఎదురుతిరుగుతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..


భార్య అనేకి కేవలం  ఒక సెక్స్ కోరకు మాత్రమే కాదని చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంత మంది భర్తల మాత్రం తమ పైశాచీకం వల్ల, భార్యలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరు భర్తలు నీలిచిత్రాలకు అడిక్ట్ అవుతుంటారు. బ్లూఫీల్మ్ చూస్తు ఆవిధంగా తమతో సంభోగం చేయాలని భార్యలను వేధిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. స్థానికంగా ఉండే ఒక వివాహిత తనను భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు డైవర్సీ ఇప్పించాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టులో పిటిషన్ విచారించిన కోర్టు మహిళ వాదానలకు బలంచేకూర్చే ప్రూఫ్స్ చూపించడంతో విఫలమైంది. అంతేకాకుండా.. భార్యభర్తలన్నక గొడవలు, బేధాభిప్రాయాలు రావడం సాధారణమే అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా.. తనను భర్త ప్రతిరోజు అసహాజంగా లైంగిక చర్య జరపాలని వేధించేవాడని పిటిషన్ లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన  మధ్యప్రదేశ్ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.


భార్యతో అసహజ సెక్స్ అనేది అత్యాచారం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. సదరు మహిళకు.. ఆ వ్యక్తితో వివాహమైనందున అది చట్టరీత్యా నేరం కాదని కోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. భార్య అసహజ సెక్స్‌లో పాల్గొన్నాడని ఆరోపిస్తూ అతనిపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. "చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యతో భర్త తనతో నివసిస్తున్న అసహజ లైంగిక చర్య IPC యొక్క సెక్షన్ 377 ప్రకారం నేరం కాదని కోర్టు పేర్కొంది.


Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..


పనికిమాలిన ఆరోపణల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని జస్టిస్ జిఎస్ అహ్లూవాలియాతో కూడిన హైకోర్టు సింగిల్ బెంచ్ పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా,  దాని వివరాలను గురువారం కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం వార్తలలో నిలిచింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter