Bilawal Bhutto Zardari: బిలావల్ భుట్టో తలను తీసుకొచ్చిన వ్యక్తికి రూ.2 కోట్ల రివార్డు.. బీజేపీ నేత ఆఫర్
Minister Bilawal Bhutto Controversy: ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. బిలావల్ భుట్టో జర్దారీ బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తూ.. దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.
Minister Bilawal Bhutto Controversy: గుజరాత్ కసాయి ప్రధాని మోదీ అంటూ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉగ్రవాదానికి సంబంధించి యూఎన్‌ఎస్‌సీలో పాక్ పరువును భారత్ తీయడంతో ఆయన తట్టుకోలేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పాక్ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన యూపీలో జరిగిన నిరసన సభలో ఓ బీజేపీ నాయకుడు విచిత్ర ప్రకటన ఇచ్చారు. బిలావల్ భుట్టో తల నరికి తీసుకువచ్చిన వారికి రూ.2 కోట్ల రివార్డు ఇస్తానని ప్రకటించారు.
బాగ్‌పత్ జిల్లా పంచాయతీ సభ్యుడు మనుపాల్ బన్సాల్ ఈ ప్రకటన చేశారు. ఆయన ఈ ప్రకటన చేయగానే.. అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా 'మనుపాల్ బన్సల్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. తాను చేసిన ఈ ప్రకటనకు ఎప్పుడు కట్టుబడి ఉంటానని మనుపాల్ బన్సాల్ స్పష్టం చేశారు. మనం ఎంతో గౌరవించే ప్రధాని మోదీ గురించి బిలావల్ భుట్టో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే.. అలాంటి వ్యక్తిని సహించబోమన్నారు. ప్రధానిపై తమకు విపరీతమైన అభిమానం ఉందని.. వారి కోసం ఏదైనా చేస్తామన్నారు.
9/11 సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చినందుకు పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బిలావల్ భుట్టో మాట్లాడుతూ వివాదాస్పరీతిలో కామెంట్స్ చేశారు. 'ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు. కానీ కసాయి బతికే ఉన్నాడని భారత్‌కు చెప్పాలనుకుంటున్నాను. అప్పట్లో మోదీకి అమెరికా వీసా నిరాకరించింది. ఆయన ప్రధాని అయ్యాకనే వీసా వచ్చింది. ఆయన ఆర్ఎస్ఎస్‌కు ప్రధానమంత్రి..' అంటూ విమర్శించారు.
ప్రధాని మోదీని కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి జమ్మూకశ్మీర్ వరకు భుట్టోకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.
Also Read: IND Vs AUS: ఉత్కంఠభరిత పోరు.. పోరాడి ఓడిన భారత్
Also Read: FD Interest Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook