India vs Australia 4th T20 Highlights: ఉత్కంఠభరిత పోరులో టీమిండియా ఓటమి పాలైంది. సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో భారత మహిళల జట్టు 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 19 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత బ్యాట్స్‌వుమెన్ రిచా ఘోష్, దీప్తి శర్మ 12 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. రిచా ఘోష్ భారత్ తరఫున కేవలం 19 బంతుల్లో 40 పరుగులతో చివర్లో దూకుడుగా ఆడినా.. జట్టును గెలిపించలేకపోయింది.
ఆసీస్ బ్యాట్స్‌వుమెన్ ఎల్లీస్ పెర్రీ 42 బంతుల్లో అజేయంగా 72 పరుగులు చేయడంతో కంగారులు భారీ స్కోర్ సాధించారు. మూడో వికెట్‌కు ఆష్లీ గార్డనర్‌తో కలిసి 59 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. గార్డనర్ 27 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసింది. చివర్లో గ్రేస్ హారిస్ దూకుడుగా ఆడి.. 12 బంతుల్లోనే 27 పరుగులు చేసింది. కెప్టెన్ అలిస్సా హీలీ కండరాల నొప్పితో 21 బంతుల్లో 30 పరుగులు చేసి క్రీజ్‌ను వదిలి వెళ్లిపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు.
189 పరుగుల లక్ష్యాన్ని అందించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారత్ నుండి 46 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. అదే సమయంలో, డెత్ ఓవర్లలో, రిచా ఘోష్ 19 బంతుల్లో 4 ఫోర్లు మరియు 2 లాంగ్ సిక్సర్లతో 40 పరుగులు చేసింది, కానీ ఆమె టీమ్ ఇండియాను గెలవలేకపోయింది. దేవికా వైద్య 32 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 19 పరుగులు చేయాల్సి ఉండగా, భారత ఆటగాళ్లు 12 పరుగులు మాత్రమే చేయగలిగడంతో టీమిండియా 7 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించలేదు. మూడో ఓవర్‌లో 16 పరుగుల వద్ద ఓపెనర్ స్మృతి మంధాన ఔటైంది. ఆ తరువాత షెఫాలీ వర్మ (20), జెమీమా రోడ్రిగ్స్ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుకున్నారు.
49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియాను హర్మన్‌ప్రీత్ కౌర్, దేవికా వైద్యలు ఆదుకున్నారు. దేవిక 26 బంతుల్లో 32 పరుగులు, హర్మన్‌ప్రీత్ 30 బంతుల్లో 46 పరుగులు చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
హర్మన్‌ప్రీత్ ఔటైన తర్వాత రిచా ఘోష్ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడింది. రిచా కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీప్తి శర్మ 8 బంతుల్లో 12 పరుగులతో చేసింది. చివరి వరకు పోరాడినా.. విజయం మాత్రం ఆసీస్‌నే వరించింది.
Also Read: FD Interest Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు
Also Read: Shardul Thakur: పెళ్లి పీటలు ఎక్కనున్న శార్దుల్ ఠాకూర్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook