మీ తల్లిదండ్రులు మీకు రావణుడు, దుర్యోధనుడు అని ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించిన ముఖ్యమంత్రి !
మీ తల్లిదండ్రులు మీకు రావణుడు, దుర్యోధనుడు అని ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించిన ముఖ్యమంత్రి !
ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అలహాబాద్‌కి ప్రయాగారాజ్ అని పేరు మార్చడంపై వస్తోన్న విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిప్పికొట్టారు. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఈ వివాదంపై స్పందిస్తూ.. అలహాబాద్ పేరు మార్పుపై తనని కూడా కొంతమంది ప్రశ్నించారని, పేరు మార్చడం వల్ల ఏం జరుగుతుందని ప్రశ్నించారని గుర్తుచేసుకున్నారు. అయితే తాను వాళ్లను సూటిగా ఒకటే ప్రశ్న అడిగాను... మీ తల్లిదండ్రులు మీకు మంచి పేర్లే పెట్టారు కానీ రావణుడు, దుర్యోధనుడు అని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించాను అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.
అలహాబాద్ పేరు మార్పు అవసరం ఏముంది అని తనని ప్రశ్నించిన వాళ్లకు.. తాను ఇలాగే సమాధానం చెప్పానని ముఖ్యమంత్రి చెప్పడం చర్చనియాంశమైంది.