ఓవైసీ కూడా హనుమానా చాలీసా చదువుతారు.. మీరు చదివింది కరెక్టే. ఇది అన్నది ఎవరో కాదు.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ . ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. వ్యూహలు, ప్రతి వ్యూహాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున యోగీ ఆదిత్యనాథ్ కూడా ప్రచార రంగంలోకి దిగారు. యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ .. ఢిల్లీలోని కిరారీలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  ను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పఠించారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంను లక్ష్యంగా చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ .. ఆయనతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ను కూడా ఎద్దేవా చేశారు. కేవలం అరవింద్  కేజ్రీవాల్ మాత్రమే కాదు .. రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో మీరు చూడవచ్చు.. అసదుద్దీన్ ఓవైసీ కూడా హనుమాన్ చాలీసా పఠించే రోజు వస్తుందని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఆ రోజు మీరు చూస్తారంటూ ఓటర్లను ఉత్సాహపరిచారు యోగీ ఆదిత్యనాథ్.