Vikas Dubey Encounter Effect: వికాస్ దుబే ( Vikas Dubey ) ఎన్‌కౌంటర్‌ తరువాత ఉత్తర్ ప్రదేశ్‌లో నేరస్థులు ( Criminals in Uttar Pradesh ) వణికిపోతున్నారు. నెక్ట్స్ తమ ఎన్‌కౌంటర్ జరుగుతుందో ఏమో అని భయపడుతున్నారు. ఇలా వారు ఆలోచించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణాల్లో ఒకటి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ( Yogi Adityanath) నేరస్థల పట్ల వ్యవహరిస్తున్న తీరు. కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ( Most Wanted Criminal) వికాస్ దుబే తప్పించుకుని తిరుగుతున్న సమయంలో యోగి ఆదిత్య నాథ్..ఇలాంటి పెద్ద పెద్ద గ్యాంగ్‌స్టర్ల లిస్టును రెడీ చేయమన్నారు. Also Read :Apsara Rani: అప్సరా రాణి గ్లామర్ సీక్రెట్ అదే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వికాస్ దుబేను మధ్య ప్రదేశ్ నుంచి యూపీకి తీసుకొస్తుండగా వాహనం ( Vikas Dubey Vehicle Overturned ) బోల్తా పడింది. దాంతో అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసు దగ్గర తుపాకీ తీసుకుని కాల్చడానికి ప్రయత్నించాడు. అందుకే అతనిపై కాల్పులు జరిపాము అని పోలీసులు తెలిపారు. 
ఈ విషయం విని యూపీ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఒక క్రిమినల్స్‌ అరెస్ట్ చేయడానికి ఇటీవలే పోలీసులు వెళ్లగా "నేను బండెక్కను .. నడుచుకుంటూ వెళ్తాను" అని సదరు క్రిమినల్ పోలీసులను కోరాడు. ఎందుకంటే వికాస్ దుబేలా అతని బండి కూడా బోల్తా పడుతుందేమో అతని భయం. 



ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) ట్రెండ్ అవుతోంది. వీడియో చివరిలో పోలీసులు మాత్రం అతన్ని బలవంతంగానే బండెక్కించారు. ఇలా క్రిమినల్స్‌‌కు ఎట్టకేలకు పోలీసుల బండి అంటే భయం కలిగింది అని నెటిజెన్స్ ( Netizens ) కొంత మంది కామెంట్ చేస్తున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..


World Population Day 2020: ప్రపంచ జనాభా గురించి ఆసక్తికరమైన 10 విషయాలు


Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు 


 Read Also:Covid-19 First Vaccine: కరోనావైరస్ తొలి వ్యాక్సిన్ ఇతనికే