Facts About Wolrd Population: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ( World Population Day ) మొదటిసారి 11 జూలై 1989న ప్రకటించారు. ఈ రోజు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. జనాభాను అదుపు చేయడానికి ( Population Control ) చేయాల్సిన పనులు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల వల్ల ఆహార కొరతతో ( Food Shortage ) పాటు ఎన్నో సమస్యలు కలుగుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన 10 విషయాలు చదివండి. Read : Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు
ప్రపంచ జనాభా గురించి...
1. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల అనే సమస్య అధికంగా ఉంది. భారత దేశంలో (Population In India ) కూడా ఈ సమస్య ఉంది. అయితే ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల మన జనాభా 138 కోట్లు ఉందని.. లేదంటే అది 307 కోట్లు ఉండేది అని నిపుణులు చెబుతున్నారు.
2. 2020 కల్లా భారత్.. చైనా ( 143 కోట్లు ) ను అధిగమనించి ( India To Surpass China In Population ) అత్యధికంగా జనాభా ఉన్న దేశంగా అవతరిస్తుంది అని నిపుణులు అంటున్నారు.
3. ప్రతీ సంవత్సరం 83 మిలియన్ల జనాభా పెరుగుదల నమోదు అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ( World Population ) 7.6 బిలియన్లు ( 760 కోట్లు ) జనాభా ఉంది.
4. జనాభా పెరగుదలను విశ్లేషించిన నిపుణులు 2050 కల్లా ప్రపంచ జనాభా 1000 కోట్లు ( World Population in 2050 ) అవుతుంది అని అంచనా వేస్తున్నారు.
5. ప్రపంచ జనాభాలో 7వ స్థానంలో ఉన్న నైజీరియా ( 20 కోట్లు )..మూడవ స్థానంలో ఉన్న అమెరికా ( 33 కోట్లు )ను 2050 కల్లా దాటి మూడవస్థానానికి చేరుకుంటుంది.
6. ప్రపంచంలోని సగం జనాభా తొమ్మిది దేశాల్లోనే ఉంది. అందుల్ చైనా, భారత్, అమెరికా ( America ), కాంగో, పాకిస్తాన్, ఇథోపియా, టాంజానియా, ఉగాండా, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. Read Also:Covid-19 First Vaccine: కరోనావైరస్ తొలి వ్యాక్సిన్ ఇతనికే
7. యూరోపియన్ దేశాల్లో జనాభా ( Population In Europe ) పెరుగుదల నిష్ఫత్తి చాలా తక్కువగా ఉంది. ఆఫ్రికాలో అత్యధిక పెరుగుదల కనిపిస్తోంది.
8. మోనాకో దేశం చిన్నది ( Monaco Population ) అయినప్పటికీ.. అక్కడ ప్రతీ చదరపు కిలోమీటరుకు 26,105 వ్యక్తులు నివసిస్తారు. ప్రపంచంలో ఇదే అత్యధికం.
9. 2000 సంవ్సరంలో జీవిత కాలం అనేది 67 సంవత్సరాలుగా ఉంటే.. ప్రస్తుతం అది 71కి పెరిగింది. 2050 కల్లా ఇది 77కి పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
10 . ప్రపంచ జనాభాలో 27 శాతం మంది యువకులే ( Youth Population ) ఉన్నారు. ఇందులో 71 శాతం ఆసియా, ఆఫ్రికాలో ఉన్నట్టు చెబుతున్నారు నిపుణులు.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..