బీజేపీకి మరో ఇబ్బందికరమైన పరిణామం తలెత్తేలా ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మపై బీహార్‌లో ఓ కేసు నమోదైంది. సీతా దేవి కూడా ఓ టెస్ట్ ట్యూబ్ బేబీనే అయ్యుండవచ్చని వ్యాఖ్యలు చేసిన దినేశ్ శర్మ ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని చందన్ కుమార్ సింగ్ అనే న్యాయవాది బీహార్‌లోని సీతామర్హి జిల్లా చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దినేశ్ శర్మ తన వ్యాఖ్యలతో కేవలం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలను సైతం కించపరిచారని చందన్ కుమార్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం ఒక వర్గం వారిని నొప్పించడానికే చేసిన కుట్రగా భావిస్తున్నట్టు చందన్ కుమార్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 


దినేశ్ శర్మపై చందన్ కుమార్ సింగ్ ఫిర్యాదుని విచారణకు స్వీకరించిన కోర్టు.. జూన్ 8వ తేదీన కేసు విచారణ చేపట్టనున్నట్టు పేర్కొంది.