UP Election Result 2022 Live: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా, దేశ ముఖచిత్రాన్ని ప్రభావితం చేసే రాష్ట్రంగా పేరున్న యూపీలో..ఏయే దశల్లో ఎన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగాయో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆసక్తిగా మారాయి. యూపీలో మరోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందనేది దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ పరాభవంతో పాటు అధికారం కైవసం చేసుకుంటుందనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక గోవాలో హంగ్ పరిస్థితులు ఏర్పడనుండటంతో అప్పుడే ఆ రాష్ట్రంలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమైపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్ధుల్ని శిబిరాలకు తరలించేసింది.


దేశంలో అందరి దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే పడింది. ఎగ్జిట్ పోల్స్ అయితే మరోసారి బీజేపీదే అధికారం అని చెబుతున్నాయి. యూపీలో మొత్తం  403 అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 10వ తేదీన తొలిదశలో 11 జిల్లాల్లో 58 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఫిబ్రవరి 14వ తేదీన రెండవ దశలో 55 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 20వ తేదీన మూడవ దశలో 59 స్థానాలకు, నాలుగవ దశ ఫిబ్రవరి 23వ తేదీన 59 స్థానాలకు, ఫిబ్రవరి 27వ తేదీన ఐదవ దశలో 61 స్థానాలకు, మార్చ్ 3వ తేదీన ఆరవ దశలో 57 స్థానాలకు, మార్చ్ 7వ తేదీన చివరి దశలో 54 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.


ఇవాళ రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. మరోసారి యోగీ పగ్గాలు చేపడతారా లేదా ప్రజలు అఖిలేష్ కు అవకాశమివ్వనున్నారా అనేది తేలనుంది. 


Also read: Goa Results 2022: మరి కాస్సేపట్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, గోవాలో మొదలైన క్యాంప్ రాజకీయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook