టెన్త్ పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలు.. 5 లక్షల మంది డుమ్మా..!
ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ ఇటీవలే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ ఇటీవలే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తమ రాష్ట్రంలో జరిగే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే ఈ వార్త వినీవినగానే దాదాపు పరీక్షలకు హాజరవకుండా అయిదు లక్షలమంది విద్యార్థులు డుమ్మా కొట్టారట.
దాదాపు ఈ యేడు 70 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఈ పద్థతి అమలుచేశాక మొదటి రోజు దాదాపు 5 లక్షలమంది విద్యార్థులు డుమ్మా కొట్టడంతో ఆశ్చర్యపోయారు అధికారులు.
ఇటీవలే యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. పరీక్షల సమయంలో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేయడం కోసమే ఈ పథకమని ఆయన తెలిపారు. ఈ కొత్త పద్ధతిని సరిగ్గా అమలుచేయమని ఆయన ఇప్పటికే ఆ రాష్ట్ర విద్యాశాఖకు సూచించారు