వీడియో: ప్రభుత్వ ఉద్యోగి చేత కాళ్లకు షూ తొడిగించుకున్న మంత్రి
వీడియో: ప్రభుత్వ ఉద్యోగి చేత కాళ్లకు షూ తొడిగించుకున్న మంత్రి
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్ ఓ ప్రభుత్వ ఉద్యోగి చేత అందరి ముందే తన షూకు లేస్ కట్టించుకోవడం ఆయన అధికార దుర్వినియోగాన్ని మరోసారి బట్టబయలు చేసింది. యోగా డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మీడియా సాక్షిగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షెహరాన్‌పూర్‌లో జరిగిన యోగా ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్న లక్ష్మీ నారాయణ్.. ఓ ప్రభుత్వ ఉద్యోగితో కాళ్లకు షూ తొడిగించుకున్నాడనే వార్త వైరల్‌గా మారిన నేపథ్యంలో ఇదే విషయమై మీడియా ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేసింది.
ఇలా వివాదాదస్పద వ్యాఖ్యలు చేయడం మంత్రి లక్ష్మి నారాయణకు ఇదేమీ తొలిసారి కాదు. గతేడాది యూపీ సర్కార్ నిర్వహించిన దీపోత్సవ్ సందర్భంగానూ లక్ష్మీ నారాయణ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడి వల్లే భారత దేశం సూపర్ పవర్‌గా మారిందన్న ఆయన.. హనుమంతుడు జాట్ కులస్తుడని వ్యాఖ్యానించారు. జాట్ కులస్తులు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి హింసకు పాల్పడిన నేపథ్యంలో మంత్రి లక్ష్మీ నారాయణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.