Epidemic Act: హత్రాస్ వెళ్లిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్పై కేసు
కరోనావైరస్ (Coronavirus) సోకిన తర్వాత హోం క్వారంటైన్‌లో ఉండకుండా హత్రాస్ ( Hathras ) బాధితురాలి ఇంటికెళ్లిన ఆప్ ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు (UP Police) కేసు నమోదు చేశారు. అంటువ్యాధుల చట్టం ( Epidemic Act) కింద ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ (AAP MLA Kuldeep Kumar) పై కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్పీ బుధవారం తెలిపారు.
UP Police files case against AAP MLA Kuldeep Kumar: లక్నో: కరోనావైరస్ (Coronavirus) సోకిన తర్వాత హోం క్వారంటైన్‌లో ఉండకుండా హత్రాస్ ( Hathras ) బాధితురాలి ఇంటికెళ్లిన ఆప్ ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు (UP Police) కేసు నమోదు చేశారు. అంటువ్యాధుల చట్టం ( Epidemic Act) కింద ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ (AAP MLA Kuldeep Kumar) పై కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్పీ బుధవారం తెలిపారు. అయితే ఢిల్లీ కోండ్లి నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ తనకు చేసిన పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలిందని సెప్టెంబరు 29న ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆ తర్వాత ఐదు రోజులకే అక్టోబరు 4న హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించినట్లు కుల్దీప్ కుమార్ ట్వీట్ చేశారు. అయితే పాజిటివ్ వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చిందో రాలేదో ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. అంతేకాకు కరోనా సోకిన వ్యక్తి హోం క్వారంటైన్‌లో ఉండాలని కేంద్రం విధించిన నిబంధనల్లో స్పష్టంగా ఉంది. Also read: Harthras Case: సిట్ కాలపరిమితి పొడిగింపు
అయితే.. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా.. ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైనందున కుల్దీప్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్పీ తెలిపారు. హత్రాస్ వెళ్లిన సమయంలో కుల్దీప్ కుమార్ ముఖానికి మాస్కు ధరించి బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే కుల్దీప్ వెంట ఆయన అనుచరులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. అయితే ఈ విషయం కాస్త పోలీసుల ద్రుష్టికి రావడంతో చర్యలు తీసుకున్నారు. Also read: Hathras Case: అందుకే అర్థరాత్రి అంత్యక్రియలు: యూపీ ప్రభుత్వం
సెప్టెంబరు 14న పొలం పని చేస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, నాలుక కోసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో సెప్టెంబరు 29న కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా, వారిని అనుమతించకుండానే అదేరోజు అర్థరాత్రి 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. ఆతరువాత ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన హత్రాస్ ఎస్పీతో సహా ఐదుగురు పోలీసు అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఈ కేసుపై సిట్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి కూడా యూపీ ప్రభుత్వం అప్పగించింది. ఈ నెల 16 సిట్ నివేదిక రానుంది. Also read: Hathras Gang Rape Case: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!