UP Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలు మూసివేశారు. గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, లక్నో, అలీఘర్, ఆగ్రా, ఇటా, మెయిన్‌పురి, ఫిరోజాబాద్ మరియు కాన్పూర్‌ సహా15కి పైగా జిల్లాల్లోని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూపీలో ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 


తెలుగు రాష్ట్రాల్లోనూ వాన జోరు...
ఏపీ, తెలంగాణలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు ఇలాగే వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ 11 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరికలు జారీ చేసింది కూడా. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 


Also Read: Gurugram: చెరువులో స్నానానికి దిగి.. ఆరుగురు చిన్నారులు మృత్యువాత 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి